ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిని కలిసేందుకు మచిలీపట్నం వెళ్లి కలిసొచ్చిన నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, వంశీ రెడ్డి, యెర్నేని నవీన్, సునీల్ నారంగ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల సారాంశాన్ని పవన్ కళ్యాణ్ కి వివరించినట్లు తెలిసింది.
పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జరుగుతోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఏకాకి అయినట్లు ప్రచారం కూడా ఉంది. నిర్మాతలు కూడా ఏపీ ప్రభుత్వం వైపు నిలబడి పవన్ కళ్యాణ్ ని ఒంటరిని చేశారన్న పుకార్ల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం కలిగింది.
అలాగే, ఈ రోజు బండ్ల గణేష్ కూడా ‘మా’ ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ వైపు నిలిచారు. అంటే… పవన్ కళ్యాణ్ వైపు లేరు అనుకున్న నిర్మాతలు అందరూ రాజకీయాలు వేరు, సినిమా వేరు అని ప్రూవ్ చేశారు.
మొత్తానికి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధించినట్లే. కొంతకాలంగా మీడియాలో పవన్ కళ్యాణ్ కి స్పేస్ లభించడం లేదు. ఈ గొడవ వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలకు ప్రచారం దక్కుతోంది.
Samantha’s upcoming film "Maa Inti Bangaaram" is showing promising signs at the North American box…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Rashi Singh has…
Veteran filmmaker Singeetham Srinivasa Rao has revealed that "Pushpa 2" and "Kantara" are the two…
Keerthy Suresh appears to be regaining momentum in Telugu cinema with a couple of high-profile…
The makers of Vijay Deverakonda’s much-awaited period action drama "Ranabaali" have unveiled the first look…
Actress and television host Vishnu Priya Bhimeneni has once again become a talking point on…