“ఓజీ” నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది అని పవన్ కళ్యాణ్ అని నిన్న ప్రకటించారు. “నాకు ఉన్న సమయంలో ఓజి యూనివర్స్ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను,” అని తెలిపారు. దాంతో అభిమానులు పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తాడని సంబరపడుతున్నారు.
కానీ “ఓజీ”కి సీక్వెలో, ప్రీక్వెలో ఇప్పట్లో రాదు. సుజీత్ ఇప్పటికే నాని సినిమా ఒప్పుకున్నాడు. ఆ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. ఆ స్క్రిప్ట్, దాని ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటాడు. 2027 తర్వాతే సుజీత్ మరో సినిమా చెయ్యగలడు.
అప్పటివరకు “ఓజీ”కి మరో భాగం తీయలేడు. ఇక పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటు సినిమాలు చెయ్యాలి. మరి 2027 తర్వాత ఆయనకి షూటింగ్ లకు కాల్షీట్లు ఇచ్చేంత టైం ఉంటుందా అనేది చెప్పలేం.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసిన జనసేనాని వచ్చే ఏడాదికి ఒకటి ఆల్రెడీ సెట్ చేశారు. మరి 2027లో “ఓజీ 2” చేస్తారేమో చూడాలి.
ప్రస్తుతానికి ఐతే ఆయన షూటింగ్ ల నుంచి, సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకుంటారు.
The makers of King Jackie Queen (KJQ) have unveiled the theatrical trailer of the much-awaited…
Actress Ritika Nayak, who recently tasted success with “Mirai,” is gearing up for the release…
Actor Ram Charan has successfully undergone surgery for a right wrist injury that worsened during…
“Chennai Love Story” is currently running well in theaters. Released in cinemas on July 24,…
The makers of “Aadarsha Kutumbam” have unveiled the film's first promotional video, introducing Venkatesh as…
Bollywood star Ranbir Kapoor is currently focused on promoting “Ramayana,” which is slated for a…