సూసైడ్ నోట్ తో కదిలిన రాధేశ్యామ్

సంక్రాంతి విడుదలకు సిద్ధమైన ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఎప్పుడు ప్రచారం ప్రారంభిస్తారో తెలీదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాంటి డిప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిందే ఈ సూసైడ్ లెటర్. అవును.. ‘రాధేశ్యామ్’ అప్ డేట్ ఇవ్వనందుకు నిరసనగా ఓ వీరాభిమాని యూవీ క్రియేషన్స్ సంస్థకు సూసైడ్ లెటర్ రాశాడు.

“టు యూవీ క్రియేషన్స్.. సర్.. ఇంతవరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావును చూసైనా రాధేశ్యామ్ అప్ డేట్ ఇస్తారనుకుంటున్నాను. చాలా రోజులు వెయిట్ చేయించారు, మేం వెయిట్ చేశాం. ఇక చాలు సర్. నా చావుకు కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరక్టర్ రాధాకృష్ణ. చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకండి. ఇట్లు.. రెబల్ స్టార్ ఫ్యాన్”

ఇలా సూసైడ్ ఉత్తరం రాస్తూనే, అందులో తన ఆవేదనను వ్యక్తంచేశాడు సదరు అభిమాని. అప్ డేట్ ఇవ్వడం లేదని ఆత్మహత్య ఉత్తరం రాయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రభాస్ సినిమా విషయంలోనే ఇలా జరిగింది. తమిళనాట గతంలో రజనీకాంత్ విషయంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.

ఈ లెటర్ చూసిన తర్వాత ‘రాధేశ్యామ్’ యూనిట్ లో చలనం వచ్చింది. ఈ నెల 15న మొదటి సాంగ్ ని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ కి ఆ రేంజు ‘డై’హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు మరి.

TeluguCinema

TeluguCinema

  • Video

Video: Vijay Deverakonda and Rashmika distribute merit scholarships

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Vijay Deverakonda and Rashmika…

36 minutes
  • News

Sreeleela turns 25; fans flood social media with wishes

Sreeleela, one of the most popular young actresses in Telugu cinema today, has turned 25.…

1 hour
  • News

Sukumar not ready with RC17 script, launch likely after Dasara

Ram Charan and Sukumar announced their much-anticipated second collaboration a while ago, with the director…

2 hours
  • Box Office

Release dates 2026: The next in line is Maa Inti Bangaram

Looking for the latest Telugu movie release schedule for 2026? This page provides a regularly…

2 hours
  • News

People say Ram Charan has surpassed me: Chiranjeevi

Ram Charan’s latest film "Peddi" is running well at the box office. Directed by Buchi…

17 hours
  • News

Lenin will arrive on July 10, says Nagarjuna Akkineni

Akhil Akkineni and Bhagyashri Borse-starrer "Lenin" has been in production for nearly two years and…

20 hours