రివ్యూలపై రఘు ఆవేదన

“47 డేస్”… . రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు రఘు కుంచె కేవలం మ్యూజిక్ డైరక్టర్ మాత్రమే కాదు. నిర్మాత కూడా. అంతేకాదు.. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి బాగా కష్టపడిన వ్యక్తి కూడా ఇతడే. అలాంటి సినిమాపై నెగెటివ్ రివ్యూస్ వచ్చేసరికి ఈ సంగీత దర్శకుడు కమ్ నిర్మాత తట్టుకోలేకపోయాడు. తన ఆవేదనను సోషల్ మీడియాలో బయటపెడుతున్నాడు.

రూపాయి పెట్టి సినిమా తీసిన నిర్మాత ఆ రూపాయి వస్తుందా రాదా అని బేల ముఖం వేసుకుని చూస్తుంటే… Netflix లో 10 రూపాయిల సినిమాతో పోల్చుకుని, ఈ రూపాయి సినిమాని సొంత వేళ్ళతో పొడిచేస్తున్నారని రఘు ఆవేదన వ్యక్తంచేశాడు.

నలుగురికి అన్నం పెట్టి, తను ఓ ముద్ద తినాలనుకునే నిర్మాత బిక్కుబిక్కుమనుకునేలా, రివ్యూలతో మానసికంగా చచ్చిపోయేలా చేస్తున్నారని రఘుకుంచె బాధపడ్డాడు. కరోనా వల్ల ఇండస్ట్రీ అంతా బాధపడుతున్న ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనైనా కాస్త మనసుపెట్టి ఆలోచించాలని కోరాడు.

థియేటర్లలో రిలీజై ఉంటే ఈ పాటికి తమ సినిమా సంక నాకిపోయేదని, ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల తట్టుకొని నిలబడిందని, సామాన్య ప్రేక్షకులు సినిమాను లైక్ చేస్తున్నారని రాసుకొచ్చాడు రఘు కుంచె.

TeluguCinema

TeluguCinema

  • Video

After a gap, HanuMan actress Amritha Aiyer makes a charming appearance

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Amritha Aiyer may not…

15 hours
  • News

OG 2 takes shape as director Sujeeth meets Pawan Kalyan

“OG 2”, the much-awaited sequel to “OG”, has taken a step forward. The team at…

16 hours
  • News

Janhvi Kapoor’s night suit leaves fans talking about her personal life

Janhvi Kapoor has once again become the subject of social media chatter, this time because…

16 hours
  • News

Venkatesh – Kalyan Ram multi-starrer: Rayalaseema backdrop!

The much-awaited collaboration between Venkatesh Daggubati, Nandamuri Kalyan Ram, and director Anil Ravipudi is all…

18 hours
  • News

Rashmika Mandanna disappointed with her role in Cocktail 2!

Rashmika Mandanna starred in “Cocktail 2,” the spiritual sequel to the hit romantic drama “Cocktail.”…

18 hours
  • News

Suma’s comment sparks fresh buzz about Ram and Bhagyashri Borse relationship

Rumors about a possible relationship between Ram Pothineni and Bhagyashri Borse have once again become…

19 hours