ఒకప్పుడు రాజమౌళి సినిమా విడుదల అవుతోందంటే అటు రెండు వారాలు, ఇటు రెండు వారాలు మరో పెద్ద సినిమా రిలీజ్ చేసేందుకు సాహసం చేసే వారుకాదు నిర్మాతలు, హీరోలు. ఎందుకంటే రాజమౌళి సినిమా మినిమమ్ నాలుగు వారాలు అన్ని థియేటర్లలో ఫుల్లు కలెక్షన్లతో ఆడుతుంది. ప్లాప్ ఎరుగని దర్శకుడాయన. ఐతే, ఈ సారి మాత్రం ఆయన సినిమా విడుదలవుతోన్న వారం రోజులకే ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ రానుంది. కుదిరితే తన ‘బంగార్రాజు’ సినిమాని కూడా రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు నాగార్జున.
రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి ఈ చిత్రాలు ఎందుకు భయపడడం లేదు? మరి రాజమౌళి ఏమనుకుంటున్నారు ఈ పోటీ గురించి?
“అస్సలు పోటీ లేదు. నన్ను అడిగితే సంక్రాంతి పండుగ సీజన్లో మూడు పెద్ద సినిమాలు వచ్చినా ఏమి కాదు. మూడు హిట్ అయ్యే స్కోప్ ఉంది. కాబట్టి నా సినిమా ఒక్కటే ఆడాలి. మిగతావి రావొద్దు అని నేను కోరుకోవడం లేదు. మిగతా సినిమాలకు ఇబ్బంది ఉండొద్దని మేము జనవరి 7కి విడుదల చేస్తున్నాము. సంక్రాంతి పండక్కి వారం ముందే వస్తోంది ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం, ఎవరితో డైరెక్ట్ పోటీ లేదు. అన్ని సినిమాలు ఆడాలి.” అని క్లారిటీ ఇచ్చారు.
రాజమౌళి, ప్రభాస్ ఇంతకుముందే మాట్లాడుకున్నారట. రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చినా ఈ సమస్య ఉండదు అని గ్రహించి డేట్స్ ఫిక్స్ చేశారట.
ఐతే, నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ నిజంగా పొంగల్ పోటీలో ఉంటుందా అన్నదే ఇప్పుడే చెప్పలేం.
Director SS Rajamouli is banking on the global appeal of Priyanka Chopra for his ambitious…
The business of Nani's “The Paradise” has begun on a strong note. The film's Nizam…
Deepika Padukone is expecting her second child, but that has not slowed her down professionally.…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Actress Meenakshi Chaudhary delighted…
Christopher Nolan's highly anticipated epic “The Odyssey” has opened to an excellent response worldwide, with…
Tamannaah Bhatia has officially begun shooting for “Ragini 3,” the latest installment in Bollywood's popular…