రామ్ చరణ్ అభిమానుల వర్రీ

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం… ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి దర్శకుడు శంకర్. ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’ ‘రోబో’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన శంకర్ సినిమా అంటే మామూలుగా ఉండదు. ఆయన టేకింగ్, మేకింగ్ భారీగా ఉంటాయి. ఐతే, ఆయన ఇంతవరకు ఎప్పుడూ ఒకేసారి రెండు చిత్రాలు తీయలేదు. కెరీర్ లో మొదటిసారి అటు ‘ఇండియన్ 2’, ఇటు ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు ఒకేసారి తీస్తున్నారు. కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్, మరికొన్ని రోజులు ఆ సినిమా షూటింగ్.

1980, 90ల వరకు చాలామంది దర్శకులు ఒకేసారి రెండు, మూడు చిత్రాలు తీసేవారు. రామ్ గోపాల్ వర్మ, మణిరత్నంల రాకతో ఆ ట్రెండ్ పోయింది. ఇన్నాళ్లకు శంకర్ అలాంటి పని చేస్తున్నారు. దాంతో, రామ్ చరణ్ సినిమా షూటింగ్ సాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదల ఇంకా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. దాంతో, ఫ్యాన్స్ గోల పెడుతున్నారు.

తాజా కబురు ఏంటంటే… శంకర్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాని మరోసారి వాయిదా వేశారు అని. వచ్చే ఏడాది వేసవి సెలవులకు రావాల్సిన ఈ సినిమాని మరో రెండు నెలలు వాయిదా వేస్తున్నారట.

మరోవైపు, ‘ఉప్పెన’ దర్శకుడు చెప్పిన కొత్త కథని రామ్ చరణ్ చాన్నాళ్ల క్రితమే ఒప్పుకున్నారు. ఇది సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టాలని రామ్ చరణ్ భావించారు. కానీ, అది కూడా ఇంకా ఆలస్యం కానుందట.

సో, ఇది రామ్ చరణ్ అభిమానులను కలవరపెట్టే మేటర్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ గతేడాది (మార్చి 2022) విడుదలైంది. మరో సినిమా రావడానికి ఇంకో ఏడాది ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాలి.

TeluguCinema

TeluguCinema

  • Box Office

‘Maa Inti Bangaaram’ passes crucial first Monday test

Samantha’s “Maa Inti Bangaaram” enjoyed a terrific first weekend run worldwide. After posting such impressive…

8 minutes
  • News

Sharwanand’s wait-and-watch approach for Bhogi

Sharwanand faced a major problem during the Sankranthi 2026 season: a lack of theaters for…

17 minutes
  • Video

Video: Rashi Singh charms in a simple Chudidhar

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Rashi Singh was busy…

12 hours
  • News

Chiranjeevi congratulates Samantha on double celebration

The success of "Maa Inti Bangaaram" has turned even more special for Samantha. Megastar Chiranjeevi…

12 hours
  • News

Audiences reject Vadde Naveen’s return to the big screen

Vadde Naveen was one of the stars of the 1990s in Telugu film industry. Though…

13 hours
  • OTT

Marmadesam Returns: ‘Veerabhadruni Rahasyam’ to premiere on ZEE5

The iconic mystery franchise "Marmadesam" is making a comeback with a new chapter, "Veerabhadruni Rahasyam…

14 hours