రంగమార్తాండకి చిరంజీవి సాయం


కృష్ణవంశీ రూపొందిస్తోన్న కొత్త మూవీ… రంగమార్తాండ. మొదలై చాలా కాలమే అయింది. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. మొత్తానికి ఇప్పుడు విడుదలకు ముస్తాబు అవుతోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ఈ మూవీ ఒక మరాఠీ చిత్రానికి రీమేక్.

కృష్ణవంశీ తనదైన శైలిలో తీస్తున్నారు ఈ రీమేక్ చిత్రాన్ని. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఇవ్వడం మరో ప్రత్యేకత.

తాజాగా, మెగాస్టార్ చిరంజీవి గొంతు కూడా కలిసింది ఈ సినిమాకి. ఈ మూవీకి వాయిస్ ఓవర్ అందిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కృష్ణవంశీ అడగడంతో వెంటనే ఓకే చెప్పేశారు. తాజగా తన వాయిస్ ఓవర్ ని రికార్డ్ చేశారు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి, కృష్ణవంశీ కాంబినేషన్ లో గతంలో ‘వందేమాతరం’ అనే సినిమాని అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వారి కాంబినేషన్ ఇప్పుడు ఇలా సెట్ అయింది.

అడగ్గానే, తన గొంతుని అరువు ఇచ్చినందుకు మెగాస్టార్ కి కృతజ్ఞతలు తెలిపారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.

TeluguCinema

TeluguCinema

  • News

Vijay and Sangeetha divorce case: All eyes on June 15 hearing

Tamil Nadu Chief Minister Vijay and his wife Sangeetha Sornalingam have been the subject of…

8 minutes
  • Video

Video: Nivetha Pethuraj stuns at Sing Geetham success meet

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Nivetha Pethuraj made a…

3 hours
  • News

Producer calls Peddi’s North America result a case study

Ram Charan-starrer "Peddi", directed by Buchi Babu, has completed 11 days of its theatrical run.…

4 hours
  • News

Mahesh Babu and Buchi Babu film? Director responds to buzz

Speculation has been rife on social media that director Buchi Babu may team up with…

4 hours
  • Video

Video: Vijay Deverakonda and Rashmika distribute merit scholarships

View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Vijay Deverakonda and Rashmika…

9 hours
  • News

Sreeleela turns 25; fans flood social media with wishes

Sreeleela, one of the most popular young actresses in Telugu cinema today, has turned 25.…

10 hours