హీరో శ్రీకాంత్, నటి ఊహ కొడుకు రోషన్ చిన్నప్పుడే తన సత్తా చాటాడు. నిర్మల క్యాంటిన్ చిత్రంలో టీనేజర్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన “పెళ్లి సందD” చిత్రంలో హీరోగా నటించాడు. ఐతే ఆ సినిమా రోషన్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. కానీ ఆ చిత్రంతో శ్రీలీల హీరోయిన్ గా స్థిరపడింది.
ఇప్పుడు రోషన్ పూర్తి స్థాయి హీరోగా అడుగుపెట్టాడు. నిన్న విడుదలైన “ఛాంపియన్” అతనికి మొదటి ఫుల్ ఫ్లెడ్జ్ హీరో రోల్. సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం బాగా వచ్చాయి. మొదటి రోజు ఈ సినిమా సంక్రాంతి సినిమాల్లో మొదటి ఛాయిస్ గా నిలిచింది.
సినిమా కన్నా రోషన్ కి మంచి మార్కులు పడ్డాయి. హీరోగా అతనికి మంచి ఫ్యూచర్ ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణం మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. డ్యాన్స్ ల్లో, నటనలో ఈజ్ కనిపించింది. తన వయసుకు సూట్ అయ్యే పాత్రలు, సినిమాలు సెలెక్ట్ చేసుకుంటే హీరోగా నిలబడుతాడు.
రోషన్ తన తదుపరి చిత్రాలను త్వరలోనే ప్రకటిస్తాడట.
Actor and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is recovering after undergoing a successful…
Netflix's Telugu original series "Super Subbu," starring Sundeep Kishan in the lead role, premiered about…
After rewriting box office records in India and North America, Bollywood blockbuster “Dhurandhar” made its…
Samantha's “Maa Inti Bangaaram” has emerged as one of the biggest blockbusters of the year.…
Janhvi Kapoor appears to be at an important juncture in her career. Ever since the…
After facing repeated delays and two consecutive box-office disappointments, actor Nikhil Siddhartha has assured fans…