సిద్దూ ఇంకా తగ్గలేదు

రెండు ఫ్లాపులు పడ్డా హీరో సిద్ధూ జొన్నలగడ్డలో ఇంకా మార్పు రాలేదు. తాను నటించే సినిమాలో తాను జోక్యం చేసుకోకపోతే ఎలా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. తన సినిమా బెటర్ గా రావాలనే తాను సీన్లు రాస్తాను అని చెప్తున్నాడు.

కానీ, సిద్ధూ జొన్నలగడ్డ వేరే దర్శకుల పనిలో చేతులు, కాళ్ళు… అన్నీ పెట్టినా అవి ఆడలేదు. “జాక్” సినిమాలో అదే పని చేశాడు. ఆ సినిమా ఢమాల్. ఇప్పుడు “తెలుసు కదా”లో అదే చేశాడు. రిజల్ట్ సేమ్.

“తెలుసు కదా” సినిమా ఫ్లాప్ అయింది. అయినా తనని జనం “టిల్లు”గానే ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది ఆడలేదు అనే భ్రమలో ఉన్నాడు. దానికి తగ్గట్లు కోన వెంకట్ లాంటివాళ్లు అదే భజన చేశారు. “కహో నా ప్యార్ హై తర్వాత హ్రితిక్ రోషన్ కి పన్నెండు ఫ్లాపులు వచ్చాయి. టిల్లు నుంచి నువ్వు వెంటనే బయటపడ్డావు,” అని కోన వెంకట్ భజన చేశారు.

కానీ నిజం ఏంటంటే… హ్రితిక్ రోషన్ మొదటి చిత్రం “కహో నా ప్యార్ హై” భారీ బ్లాక్ బస్టర్. ఐదో చిత్రం “కభీ ఖుషి కభీ గమ్” మంచి హిట్. పదో చిత్రం …కోయి మిల్ గయా … భారీ బ్లాక్ బస్టర్. ఆ తర్వాత క్రిష్, ధూమ్ 2… సంచలన విజయాలే.

ఇక సిద్ధూకి ఉన్న “టిల్లు” ఇమేజ్ నే “తెలుసు కదా”లో వాడారు.

ఇలాంటి ఫాల్స్ ట్రాప్ లో ఉన్నాడు సిద్ధూ అని మనకు తెలుసు కదా.

TeluguCinema

TeluguCinema

  • News

‘Raave Cheliya’ from Srinivasa Mangapuram released

The makers of “Srinivasa Mangapuram” have unveiled "Raave Cheliya” song from the film ahead of…

4 minutes
  • News

Prabhas and Yash set a new release trend among top South stars

Prabhas and Yash have emerged as the only leading South Indian stars to release two…

18 minutes
  • News

‘Raasa Gummadi’ from Korean Kanakaraju: The song is filled with folk beats

Varun Tej's upcoming horror-comedy “Korean Kanakaraju” is gearing up for its theatrical release on August…

32 minutes
  • News

ZEE5 officially confirms NBK111 and Vrushakarma acquisitions

ZEE5 has officially announced the acquisition of the digital streaming rights for Nandamuri Balakrishna's upcoming…

40 minutes
  • News

Release date puzzle for Vijay Deverakonda’s Ranabaali

The makers of Vijay Deverakonda's “Ranabaali” are reworking the film's release plans after deciding to…

8 hours
  • News

Lokesh Kanagaraj vs Varun Tej: Box office clash on August 7

Director Lokesh Kanagaraj is all set to make his acting debut with “DC,” and the…

11 hours