మార్చి 19న విడుదల కావాల్సిన అడవి శేష్ (Adivi Sesh) కొత్త చిత్రం “డెకాయట్” (Dacoit) వాయిదా పడింది. కొత్త డేట్ గా ఏప్రిల్ 10న ఫిక్స్ చేసింది టీం. ఈ సినిమా మొదటి పాటని ఇటీవల విడుదల చేశారు.
ఐతే, ఏప్రిల్ 10న రావాల్సిన “స్వయంభు” ఆ డేట్ ని వదిలేసుకొంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతోన్న “స్వయంభు” ఏప్రిల్ 17న వచ్చే అవకాశం ఉంది. అడవి శేష్ సినిమాతో పోటీ పడడం లేదు. ఎందుకంటే, ఈ రెండు సినిమాలకు తెలుగుతో పాటు హిందీ మార్కెట్ కూడా కీలకం. రెండు తెలుగు చిత్రాలు ఒకేరోజు హిందీ మార్కెట్ లో పోటీ పడితే అక్కడి జనాలకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మీడియా పబ్లిసిటీ కూడా విడిపోతుంది.
అందుకే, “స్వయంభు” ఇంకా డేట్ ప్రకటించలేదు. కానీ “డెకాయిట్”తో మాత్రం పోటీ ఉండదు అని క్లారిటీ వచ్చింది.
ఈ సినిమాలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే హిందీ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకి హిందీ మార్కెట్ లో ఛాన్స్ ఎక్కువ ఉంది.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…