కమల్ హాసన్ చాలా ఏళ్ళు హిట్ లేక ఇబ్బందిపడ్డారు. ఒకవిధంగా చెప్పాలంటే అప్పులు, ఆర్థిక కష్టాలతో సతమతం అయ్యారు. వాటి నుంచి బయటపడేందుకే “బిగ్ బాస్” షో ఒప్పుకున్నారు. ఆ షో కమల్ ని కొంత వరకు ఆదుకున్న మాట వస్తావం. ఐతే నటుడిగా ఆయన సినిమాలకు మళ్ళీ బిజినెస్ క్రేజ్ తెచ్చిన చిత్రం మాత్రం… “విక్రమ్.”
దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన “విక్రమ్” తమిళనాట అన్ని రికార్డులను తుడిచిపెట్టింది. దాంతో, కమల్ వరుసగా సినిమాలు ఒప్పుకున్నారు. అలా ఆగిపోయిన “ఇండియన్ 2” సినిమాని పూర్తి చేశారు. దర్శకుడు శంకర్… కనగరాజ్ కంటే పెద్ద హిట్ తీయాలనుకున్నాడు. కానీ ఘోరమైన ఫ్లాప్ ఇచ్చాడు. ఆ సినిమా కమల్ హాసన్ కి ఇటీవల మొదటి దెబ్బ.
దాని నుంచి కోలుకునేందుకు మణిరత్నంతో సినిమా మొదలుపెట్టారు. “పొన్నియన్ సెల్వన్” సినిమాలతో మణిరత్నం భారీ విజయాలు అందుకున్నారు. ఆ రెండు భాగాలూ తమిళనాట అద్భుతంగా ఆడాయి. ఒక్కసారిగా మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్ అనగానే తమిళ ట్రేడ్ వర్గాలు సంతోషపడ్డాయి. బిజినెస్ క్రేజ్ ఉంటుందనే కమల్ హాసన్ “థగ్ లైఫ్” సినిమాలో నిర్మాతగా వాటా తీసుకున్నారు.
కానీ తీరా విడుదల తర్వాత సీన్ మారింది. గురువారం విడుదలైన “థగ్ లైఫ్” అన్ని చోట్లా ఫ్లాప్ టాక్ తెచ్చుకొంది.
దర్శకుడు శంకర్ కి ఈ మాత్రం తగ్గకుండా బోర్ సినిమా తీశారు మణిరత్నం. మొదట శంకర్, ఇప్పుడు మణిరత్నం….ఇద్దరూ కమల్ హాసన్ కి బ్యాడ్ రిజల్ట్ ఇచ్చారు. ఐతే, ఈ సినిమా పరాజయంలో కమల్ పాత్ర కూడా ఉంది. ఎందుకంటే “థగ్ లైఫ్” కథ కమల్ రాసిందే.
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…