సూర్యకి తాజాగా జ్ఞానోదయం అయింది. కమల్ హాసన్ లా, విక్రమ్ లా కొన్నాళ్ళూ గెటప్ ల పిచ్చిలో పడి కొన్ని సినిమాలు చేశాడు. అవి జాడించి తన్నాయి. ముఖ్యంగా ఇటీవల చేసిన కంగువ, రెట్రో చిత్రాల ఫలితాలతో కళ్ళు బైర్లు కమ్మాయి సూర్యకి.
‘కంగువ’ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు కేటాయించాడు. ‘రెట్రో’కి ఏడాదిన్నర పాటు వర్క్ చేశాడు. రెండూ దారుణంగా ఫ్లాప్. దాంతో, ఇక అలాంటి సినిమాలు వద్దు అంటున్నాడు సూర్య. ఎవరైనా అలాంటి ప్రపోజల్ తో వస్తే నో చెప్పేస్తున్నాడు. తాజాగా దర్శకుడు వెట్రిమారన్ సినిమాని కూడా రద్దు చేశాడు. వాడివాసల్ (Vaadivaasal) పేరుతో ఇంతకుముందే ప్రకటించిన ఈ సినిమాని చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు సూర్య.
అలాంటి ప్రయోగాలు పెట్టి సింపుల్ కథతో స్పీడ్ గా పూర్తి అయ్యే సినిమాలు ఒప్పుకుంటున్నాడు. తాజాగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఒక సినిమా ఒప్పుకున్నాడు. అది వచ్చే వేసవి నాటికి విడుదల అవుతుంది. ఆ తరువాత కూడా స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసే దర్శకులకు అవకాశం ఇస్తానని చెప్తున్నాడు.
ఎక్కువ హడావిడి లేని ప్రాజెక్ట్స్, అందరికీ కనెక్ట్ కథలు మొదటి ప్రాధాన్యం అని చెప్తున్నాడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…