హీరో అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు ఉదయ శ్రీనివాసు. ఎవరీ ఉదయ శ్రీనివాసు అనే డౌట్ వస్తుందా? అందరికీ బన్నీ వాసుగా పరిచయం. ఆయన ఇప్పుడు నిర్మాత. అల్లు అర్జున్ తో స్నేహం, గీతా ఆర్ట్స్ లో పని చేసి ఇప్పుడు మంచి నిర్మాతగా ఎదిగారు. తన పేరు ఉదయ శ్రీనివాస్ ని కేవలం లీగల్ డాక్యుమెంట్స్ కి పరిమితం చేసి బన్నీ వాసుగా మారిపోయారు. అంతటి స్నేహం బన్నీతో.
అయినా, బన్నీ (అల్లు అర్జున్) ఈ బన్నీ వాసు మాట వింటాడా ఇప్పుడు?
తాజాగా వాసు హీరోలు అందరూ ఎక్కువ సినిమాలు చెయ్యాలి, రెండేళ్ళకి, మూడేళ్లకు సినిమాలు చేస్తే ఇండస్ట్రీ బాగు పడదు అని పెద్ద పోస్ట్ పెట్టాడు. ఓటిటికి వెంటనే సినిమాలు ఇవ్వడం వల్ల థియేటర్లు మూతపడే ప్రమాదం ఉంది అని వాసు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పటానికి బాగుంటాయి కానీ ఎవరు వింటారు? ఎవరు పాటిస్తారు? సొంత మిత్రుడే అల్లు అర్జున్ ఏడాదికి ఒక సినిమా విడుదల చేయగలడా? అలా బన్నీని బన్నీ వాసు ఒప్పించగలడా?
ఇది బన్నీ వాసు పోస్ట్….
“ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి అనేది ఆలోచించాలి తప్ప.. ఇలాగ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి. ఈ విషయం పెద్ద హీరోలు కూడా ఆలోచించాలి. మీరు రెండు సంవత్సరాలకు ఒక సినిమా మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు కూడా దూరమైపోతారు. ఈ రెండు మూడేళ్లలో చాలా మంది థియేటర్ ఓనర్స్ వాటిని మెయింటైన్ చేయలేక మూసేస్తారు. సింగిల్ స్క్రీన్స్ మూత పడినట్టైతే ఓన్లీ మల్టీప్లెక్స్ థియేటర్స్ అయితే పెద్ద హీరోలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ సినిమా థియేటర్స్ ద్వారా వచ్చే ఆదాయం కేవలం 43% మాత్రమే నిర్మాతలకు వెళుతుంది.”
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…