జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పెద్ద హీరోయిన్. ఇప్పుడు తెలుగులో పెద్ది సినిమాలో నటిస్తోంది. అనుకున్నట్లు అన్నీ జరిగితే “పెద్ది” ఈపాటికే విడుదల అయ్యేది. ఆ తర్వాత జాన్వీ ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేది.
కానీ “పెద్ది” సినిమా జూన్ కి వాయిదా పడింది. ఈ రెండు నెలలు ప్రమోషన్లతో ఆమె బిజీగా ఉంటుంది. ఐతే ఈ సినిమా తర్వాత ఆమె వెంటనే షూటింగ్ లో పాల్గొనే సినిమా మరోటి సెట్స్ పై లేదు. ఆమె కెరీర్ ఇప్పుడు స్లో అయింది.
ALSO CHECK: Janhvi Kapoor’s backless outfit Pictures
జాన్వీ కపూర్ ఇంతకుముందు ఒప్పుకున్న బాలీవుడ్ చిత్రాలు అన్నీ విడుదల అయ్యాయి. గతేడాదే అన్నీ వచ్చేశాయి. ఇక తెలుగులో ఆమె ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సరసన “రాకా” అనే సినిమా ఒప్పుకొంది. కానీ ఆమె షూటింగ్ పార్ట్ ఇంకా కంఫర్మ్ కాలేదు. అలాగే ఎన్టీఆర్ తో మరోసారి “దేవర 2″లో నటిస్తుంది అని అనుకున్నారు. కానీ ఆ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం.
ఇటీవల ఆమె దర్శక, నిర్మాత కరణ్ జోహార్ టీం నుంచి బయటకి వచ్చింది. దాంతో కరణ్ జోహార్ ఆమెతో కొత్తగా సినిమాలు ప్రకటించడం లేదు. ఇక బాలీవుడ్ లో ఆమెకి పెద్దగా సక్సెస్ రేట్ లేకపోవడంతో ఇప్పుడు కొత్త ఆఫర్లు విరివిగా రావడం లేదు. దాంతో జాన్వీ జోరు తగ్గింది ఇప్పుడు.
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…