ప్రభాస్ కొత్త సినిమా ప్రకటనకు సంబంధించి తెరవెనక జోరుగా కార్యక్రమాలు సాగుతున్నాయి. శివరాత్రి నాడే ప్రకటన వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఈ గ్యాప్ లో టెస్ట్ కట్స్ పూర్తి చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. ఆల్రెడీ ప్రభాస్ పై టెస్ట్ షూట్ కూడా పూర్తయింది.
ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం భాగ్యశ్రీ బోర్సేను ప్రభాస్ సరసన హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమెపై కూడా తాజాగా టెస్ట్ షూట్ నిర్వహించారు. ఇలా అధికారికంగా ప్రకటించనప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ లో సినిమా పనులు జోరుగా సాగుతున్నాయి.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ భాగ్యశ్రీకి అవకాశాలొస్తున్నాయి.
విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ లాంటి హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ అంటున్నారు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…