ఇటీవల ఎన్నికల్లో జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో తిరుగులేని శక్తి అని ప్రూవ్ చేసుకొంది. సోషల్ మీడియాలో జనసైనికులు ఇప్పటికీ తెగ హంగామా చేస్తుంటారు. అలాంటి జనసేన శక్తి తమ సొంత నాయకుడి కొడుకు సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా ఇవ్వలేకపోయారు.
నాగబాబు జనసేనలో “కీలక” నేత. ఆయన కొడుకు నటించిన “మట్కా” సినిమా గత వీకెండ్ విడుదలైంది. వరుణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశారు. కానీ పాపం వరుణ్ తేజ్ సినిమా విడుదలైతే కనీసం ఓపెనింగ్ కూడా ఇవ్వలేదు జనసైనికులు. గోదావరి జిల్లాలో కూడా సినిమాని పట్టించుకోలేదు.
వరుణ్ తేజ్ “మట్కా” సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ కూడా చేశాడు. దాన్ని జనసేన ఫాలోవర్స్ తెగ ట్రెండ్ చేశారు సోషల్ మీడియాలో. కానీ సినిమా చూసేందుకు మాత్రం పోలేదు.
వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యల్ప కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది “మట్కా”. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వరుణ్ తేజ్ నుంచి విడుదలైన మొదటి చిత్రం ఇదే. అభిమానుల వల్ల సినిమాలు అడవు అని మరోసారి ప్రూవ్ అయింది. సినిమాలో విషయం ఉంటేనే జనం చూసేందుకు వస్తారు. సాధారణ జనం వల్లే సినిమాలు ఆడుతాయి తప్ప సోషల్ మీడియాలో హడావిడి చేసే ఫ్యాన్స్ వల్ల ఉపయోగం ఉండదు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…