సమంత (Samantha) మళ్ళీ గ్లామర్ గేమ్ లోకి వచ్చింది. ఆ మధ్య సైలెంట్ అయిపోయిన ఈ భామ రెండో పెళ్లి తర్వాత నటిగా, బ్రాండ్ అంబాసిడర్ గా, ఫ్యాషన్ సెలెబ్రిటీ మోడల్ గా హల్చల్ చేస్తోంది.
సమంత తాజాగా “మా ఇంటి బంగారం” అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే 15న విడుదల కానుంది. ఈ సినిమాతో ఆమె కొత్త ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఈ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. నిర్మాత కూడా ఆమె. ఇక ఆమె భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకి మెయిన్ కథ అందిస్తూ, షో రన్నర్ గా ఉన్నారు. కాకపోతే దర్శకత్వం వహిస్తున్నది మాత్రం నందిని రెడ్డి.
నాగ చైతన్యతో విడాకులు, ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె ఇటీవల పెద్దగా సినిమాలు చెయ్యలేదు. కానీ గత డిసెంబర్ లో రెండో పెళ్లి చేసుకున్నాక ఆమె కుదుటపడింది. మానసికంగా, శారీరకంగా ఇప్పుడు బలంగా ఉందట. తాజాగా వోగ్ మేగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
అంతే కాదు, ఇదే ఊపులో మంచి గ్లామర్ ఫోటోషూట్ కూడా చేసింది. సో, ఆమె నుంచి మరిన్ని సినిమాలు మనం చూడొచ్చు.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…