Categories: అవీ ఇవీ

100లో ఒకరు ఈ కసక్

దేశంలో ఉన్న 100 మంది ప్రభావశీలమైన యువతుల్లో ఒకరుగా పేరొందింది శ్రీలీల. “100 Most Influential Young People” అంటూ తాజాగా ఒక మేగజైన్ జరిపిన సర్వేలో శ్రీలీలకు చోటు దక్కింది.

శ్రీలీలకి దేశవ్యాప్తంగా ఇంత క్రేజు ఉందా అనే డౌట్ మనకి రావొచ్చు. ఐతే, ఆమె “కిస్సిక్” అనే ఐటెం సాంగ్ (పుష్ప 2)తో నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. అందుకే, సర్వేలో ఈ భామకి చోటు దక్కింది.

శ్రీలీల వయసు కేవలం 23 ఏళ్ళు. ఎంబీబీఎస్ చదువుకొంది. పాతికేళ్లలోపే పేరు, డబ్బు, క్రేజ్ పొందింది ఈ తెలుగు భామ.

ఇక ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా సక్సెస్ అయితే ఆమె ఇన్ ఫ్లుయెన్స్ మరింత పెరుగుతుంది అనడంలో సందేహం అక్కర్లేదు. తెలుగులో మంచి హిట్ కొట్టేందుకు కష్టపడుతోంది. కానీ త్వరలోనే విడుదల కానున్న రెండు తెలుగు సినిమాలు ఆ కొరత తీర్చొచ్చు.

ప్రస్తుతం ఆమె రవితేజ సరసన “మాస్ జాతర” సినిమాలో నటిస్తోంది. ఇక అఖిల్ అక్కినేని సరసన “లెనిన్” అనే మూవీ చేస్తోంది. హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన “ఆషికి 3” మూవీలో నటిస్తోంది.

Admin

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

3 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

6 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

1 day ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

1 day ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

1 day ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

1 day ago