ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో క్రేజ్ తో దూసుకుపోతోంది తమన్న. సినిమాలు, ఓటీటీ అనే తేడా లేకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇదే క్రమంలో ఐటెంసాంగ్స్ కూడా వరుసగా చేస్తోంది.
తెలుగులో ఇప్పటికే పలు స్పెషల్ సాంగ్స్ చేసిన మిల్కీబ్యూటీ, తాజాగా బాలీవుడ్ మూవీ స్త్రీ”-2″లో కూడా ఐటెంసాంగ్ చేసింది. సినిమా విడుదలకు ముందే ఈ సాంగ్ సూపర్ హిట్టయింది. ప్రస్తుతం 110 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడీ సాంగ్ కోసం తమన్నా తీసుకున్న రెమ్యూనరేషన్ పై వాడివేడి చర్చ జరుగుతోంది. ఈ ఒక్క పాటతో పాటు, ఓ చిన్న సీన్ లో నటించడం కోసం తమన్న అక్షరాలా కోటిన్నర రూపాయలు తీసుకుందట.
మూడేళ్ల కిందట వచ్చిన “స్త్రీ” సినిమాలో నోరా ఫతేహీ ఐటెంసాంగ్ సాంగ్ చేసింది. అది కూడా సూపర్ హిట్టయింది. ఆ పాట కోసం ఆమెకు 25 లక్షల రూపాయలిచ్చారు. సీక్వెల్ లో సాంగ్ కోసం తమన్నాకు ఏకంగా కోటిన్నర రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. తమన్నాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు అంత మొత్తం ఇచ్చారు. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాన్నిచ్చింది. స్త్రీ-2 విడుదలకు ముందు తమన్న ఐటెంసాంగ్స్ పెద్ద హిట్టయింది.
ఇక ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా వసూళ్లు ఇప్పటికే 250 కోట్లకు చేరుకున్నాయి. దాదాపు 400 కోట్ల వరకు వసూళ్లు వస్తాయని అంచనాలున్నాయి. అంటే ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాలా? సో, తమన్నా ఐటెం సాంగ్స్ కి బాలీవుడ్ లో మరింత క్రేజ్ పెరగొచ్చు.
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…