సీక్వెల్స్ పై దర్శకుడు కృష్ణవంశీ ఇప్పటికే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సీక్వెల్స్ ఎలా తీస్తారో తనకు అస్సలు అర్థం కాదంటూ స్పందించాడు. తను ఎట్టిపరిస్థితుల్లో సీక్వెల్స్ చేయనని కూడా ప్రకటించాడు. దీంతో కృష్ణవంశీకి సీక్వెల్స్ అంటే ఇష్టంలేదని అర్థమైపోయింది.
అయినప్పటికీ ఈ దర్శకుడ్ని సీక్వెల్స్ పై ప్రశ్నిస్తూనే ఉన్నారు నెటిజనం. తాజాగా “మురారి” సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చిన సందర్భంగా ఆ సినిమా సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది.
మహేష్ వీరాభిమాని ఒకరు కృష్ణవంశీని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. గౌతమ్ ఎలాగూ సినిమాల్లోకి వస్తాడు కాబట్టి, అతడ్ని హీరోగా పెట్టి “మురారి-2” తీయాలనేది అతడి అభ్యర్థన.
ఇదొక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ కావడంతో కృష్ణవంశీ, గతంలోలా వెంటనే నో చెప్పలేకపోయాడు. అది తన పరిథిలో లేని అంశమని మాత్రమే స్పందించాడు. “మురారి” సీక్వెల్ పై మహేష్, నమ్రత, గౌతమ్ కలిసి నిర్ణయం తీసుకోవాలని, అది తన చేతిలో లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…