2025: మలి సగం మెరవాల్సిందే!

6 నెలలు గడిచిపోయాయి. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా మాత్రమే కనిపిస్తోంది. ఈ మూవీ తర్వాత ‘కుబేర’, ‘తండేల్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘కోర్టు’, ‘సింగిల్’ లాంటి ఓ అరడజను సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి మలి సగం సంగతేంటి?

రాబోయే 6 నెలలు పరిశ్రమకు కీలకంగా మారాయి. తొలి సగంలో కనిపించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి విజయాలు కనీసం ఓ 2 అయినా పడాలి. థియేట్రికల్ వ్యవస్థ నిలబడాలన్నా, డిస్ట్రిబ్యూటర్లు నిలదొక్కుకోవాలన్నా ఈ 6 నెలలు చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి సినిమాలున్నాయా?

ప్రతి నెల పదుల సంఖ్యలో సినిమాలొస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ మార్కెట్లో నిలబడి, ఇండస్ట్రీని నిలబెట్టే సినిమా కావాలి. మిగిలిన ఈ 6 నెలల్లో భారీ అంచనాలతో వస్తున్న అలాంటి సినిమా ‘హరిహర వీరమల్లు’. సినిమా క్లిక్ అయిందంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయం. పవన్ స్టామినా అది.

ఇక్కడితో అయిపోలేదు. మలి సగంలో పవన్ నటించిన ‘ఓజీ’ సినిమా కూడా ఉంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అనుకున్న తేదీకి వచ్చి క్లిక్ అయితే మాత్రం టాలీవుడ్ స్లంప్ నుంచి బయటపడినట్టే.

ఇక లిస్ట్ లో ‘రాజాసాబ్,’ ‘అఖండ-2’ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రెండూ ఈ ఏడాదిలోనే వస్తున్నాయి. ఇవి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ భవితవ్యాన్ని డిసైడ్ చేయబోతున్నాయి.

జాబితాలో ‘ఘాటీ’, ‘మాస్ జాతర’ సినిమాలున్నప్పటికీ పైన మనం చెప్పుకున్న సినిమాల స్థాయిలో ప్రభావం చూపించేవి కావివి. ఇవి కాకుండా, సాయి ధరమ్ తేజ “సంబరాల ఏటి గట్టు”, అడవి శేష్ “డెకాయిట్” ఉన్నాయి. ఇలా రాబోయే 6 నెలల్లో దాదాపు 5 పెద్ద సినిమాలున్నాయి. వీటిలో కనీసం 3 బ్లాక్ బస్టర్ హిట్టయినా టాలీవుడ్ కు గోల్డెన్ పీరియడ్ మొదలైనట్టే.

Admin

Recent Posts

Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు

సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, కానీ ఈ మధ్యకాలంలో పరాజయాలు వస్తే చాలు నటీనటులపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్…

2 hours ago

Meenakshi Chaudhary: ఆ నంబర్ నాది కాదు

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు అభిమానులకు ఎంత దగ్గరవుతున్నారో, అదే స్థాయిలో కేటుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.…

2 hours ago

OG 2: సుజీత్ ఫారిన్ నుంచి వచ్చాక

ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీ 'ఓజీ' (OG). ఈ సినిమాకు ముందొచ్చిన…

2 days ago

Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!

ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)కి భారీ హిట్ దక్కింది. అయినా ఆమెకి తెలుగులో ఇంకో పెద్ద ఆఫర్ రాలేదు. అందుకే…

2 days ago

Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు

మొట్టమొదటి 'ఫార్చ్యూన్ ఇండియా-ఇంటర్‌బ్రాండ్ అత్యంత విలువైన సెలబ్రిటీల' (India’s Most Valuable Celebrities) జాబితాలో సౌత్ నుంచి ఒకే ఒక్కడికి…

2 days ago

Katrina Kaif: రీఎంట్రీ వార్తలు తప్పు!

హీరోయిన్ గా దాదాపుగా 20 ఏళ్ళు ఏలింది కత్రినా కైఫ్ (Katrina Kaif). బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా…

3 days ago