అమీర్ ఖాన్, అల్లు అరవింద్ అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కలిసి తొలిసారి బాలీవుడ్ కు వంద కోట్ల రూపాయల సినిమాను అందించారు. ఇక అమీర్ ఖాన్, నాగచైతన్య బంధం గురించి కూడా తెలిసిందే. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేశారు.
అలాంటిది ఇప్పుడు అల్లు అరవింద్, నాగచైతన్య కలిసొచ్చి మరీ అడిగితే అమీర్ కాదనగలడా? అందుకే తన కొడుకు సినిమాను కూడా పక్కనపెట్టి మరీ చైతూ సినిమా ఫంక్షన్ కు వచ్చాడు.
నాగచైతన్య హీరోగా నటించిన ‘తండేల్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7న ఆ సినిమా థియేటర్లలోకి వస్తోంది. అదే రోజు అమీర్ కొడుకు నటించిన సినిమా కూడా రిలీజ్ అవుతోంది.
ఓవైపు తన తనయుడి సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ.. అల్లు అరవింద్, నాగచైతన్య అడగడంతో ‘తండేల్’ హిందీ ట్రయిలర్ లాంచ్ కు హాజరయ్యాడు అమీర్. ఇదే విషయాన్ని వేదికపై కూడా ప్రకటించి, అల్లు అరవింద్, చైతూపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
కథ బాగుంటే ఎన్ని సినిమాలైనా చూస్తారని.. అదే విధంగా ‘తండేల్’తో పాటు తన కొడుకు నటించిన సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని అంటున్నాడు అమీర్.
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…