Categories: న్యూస్

గుండు పోలీస్ తో నటించాలి!

అలియా భట్ కి ఇప్పుడు ఒక పెద్ద హీరోతో నటించాలన్న కోరిక లేదు. ఒక మలయాళం హీరోతో ఒక సినిమా చెయ్యాలని భావిస్తోంది. ఎందుకంటే అతని నటనకు ఆమె ఫిదా అయిపొయింది.

అతనెవరో కాదు… ఫహద్ ఫాజిల్. ఈ మలయాళం హీరో టాలెంట్ మన తెలుగు ప్రేక్షకులకే కాదు హోల్ ఇండియాకి తెలిసిపోయింది “పుష్ప”, “పుష్ప 2” సినిమాలతో. “గుండు పోలీసు” షెఖావత్ గా “పుష్ప”లో అదరగొట్టిన ఫహద్ ఎలాంటి పాత్రనైనా పోషించగల నటుడు.

మలయాళంలో హీరోగా నటిస్తాడు. అలాగే చిన్న పాత్రలు కూడా పోషిస్తాడు. తమిళంలో కమల్ హాసన్ “విక్రమ్” సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు కదా. తెలుగులో విలన్ గా మెప్పించాడు. ఇక ఇటీవల ఆయన మలయాళంలో చేసిన “ఆవేశం” సినిమా చూసి అలియా భట్ స్టన్ అయిపోయిందట. ఇంత వైవిధ్యమైన నటన ఎలా సాధ్యం అంటూ ఆమె ఆశ్చర్యపోతోంది. అందుకే ఆయనతో ఒక సినిమా చెయ్యాలని ఉంది అని చెప్తోంది.

అలియా భట్ ప్రస్తుతం భర్త రణబీర్ కపూర్ తో “లవ్ అండ్ వార్”లో నటిస్తోంది.

Admin

Recent Posts

Sai Pallavi: విమర్శల జడిలో వరుసగా చిత్రాలు చేస్తోంది

ఒకవైపు ఫ్లాపులు వెంటాడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరుగుతోంది. అయినా సాయి పల్లవి (Sai Pallavi)కి పెద్ద…

27 minutes ago

Anshu: అటు అమ్మ పాత్రలు, ఇటు బికినీ అందాలు

2003లో విడుదలైన రాఘవేంద్ర చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించి, ఆ తర్వాత నాగార్జున 'మన్మధుడు' చిత్రంలోనూ రెండో…

1 hour ago

MM Keeravani: వారణాసికి పూర్తిగా ఐదు నెలల డెడికేషన్!

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో, హీరోయిన్లుగా రాజమౌళి తీస్తున్న "వారణాసి" (Varanasi) చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జోరుగా…

3 hours ago

తెలుగుకే నా మొదటి ప్రాధాన్యత: Ritika Nayak

'మిరాయ్', 'హాయ్ నాన్న' వంటి సినిమాల్లో నటించిన రితిక నాయక్ (Ritika Nayak)కి ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు…

16 hours ago

Irumudi డేట్ లో మార్పు లేదు, నిర్మాతల ప్రకటన

రవితేజ నటించిన "ఇరుముడి" (Irumudi) చిత్రం వాయిదా పడనుంది అని ఇటీవల రూమర్లు వచ్చాయి. కానీ ఈ సినిమా ఆగస్టు…

17 hours ago

Katrina Kaif: ‘స్పిరిట్’లో ఆమె ఎంట్రీ.. అవన్నీ రూమర్లేనట!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit)…

1 day ago