తన సినిమాలకు సంబంధించి తను కేవలం పారితోషికం మాత్రమే తీసుకుంటానని, లాభాల్లో వాటా అడగనని స్పష్టం చేశాడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు కూడా రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నానని తెలిపాడు.
“ఈ సినిమాలో నాకు భాగస్వామ్యం లేదు. నేనెప్పుడూ జీతానికే పనిచేస్తాను. లాభాల్లో వాటా ఇంతవరకు ఏ నిర్మాతనూ అడగలేదు,” అని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. “శాలరీ మాట్లాడుకుంటాను. బడ్జెట్ లో సినిమా తీస్తాను. నిర్మాతలకు డబ్బులు బాగా వచ్చి, వాళ్లు ప్రేమతో ఇస్తే తీసుకుంటాను తప్ప, వాటా అడగను,” అని క్లారిటీగా చెప్పాడు.
‘భగవంత్ కేసరి’ సక్సెస్ తర్వాత ఆ నిర్మాత ఇష్టంతో తనకు కారు ఇచ్చారని, అలా ఇస్తే తీసుకుంటాను తప్ప డిమాండ్ చేయనని అన్నాడు రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ తో దిల్ రాజు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి రెడీ అని ప్రకటించాడు.
ప్రస్తుతం దిల్ రాజు ఆఫీస్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆ తర్వాత దిల్ రాజు, శిరీష్ అనిల్ కి గిఫ్ట్ ఇవ్వాలి అన్నమాట.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…