సహాయం చేసినవాడ్ని మరిచిపోకూడదు. మరీ ముఖ్యంగా ప్రాణాలు కాపాడిన వాడ్ని అస్సలు మరిచిపోకూడదు. సైఫ్ ఇప్పుడు అదే పనిచేశాడు.
కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న సైఫ్ ను సరైన సమయంలో ఆదుకున్నాడు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా. తన ఆటోలో హుటాహుటిన లీలావతి హాస్పిటల్ కు సైఫ్ ను తీసుకెళ్లాడు.
తనను సకాలంలో హాస్పిటల్ లో జాయిన్ చేసిన భజన్ సింగ్ ను సైఫ్ కలిశాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు భజన్ సింగ్ ను కలిసిన సైఫ్, అతడ్ని కౌగలించుకున్నాడు. హాస్పిట్ లో తన బెడ్ పై అతడ్ని కూర్చోబెట్టుకున్నాడు. అతడితో ఫొటోలు దిగాడు. బయటకొచ్చిన భజన్ సింగ్, ఆరోజు రాత్రి ఏం జరిగిందో వెల్లడించాడు.
“నేను రాత్రిపూట నా వాహనాన్ని నడుపుతాను. తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో నేను ఒక మహిళ ఆటోను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు గమనించాను. కాని ఎవరూ ఆపలేదు. గేటులోపల నుంచి కొంతమంది ఆటో రిక్షా అంటూ అరుస్తున్నారు. నేను యూ-టర్న్ తీసుకొని గేటు దగ్గర నా ఆటో ఆపాను. రక్తంతో తడిసిన ఓ వ్యక్తి నలుగురితో కలిసి బయటకు వచ్చాడు. అతడిని ఆటోలో ఎక్కించుకుని లీలావతి ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేను వారిని అక్కడ డ్రాప్ చేశా. అతను సైఫ్ అని నాకు తర్వాత తెలిసింది.”
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…