చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లెక్కప్రకారం సంక్రాంతికి విడుదల కావాలి. కానీ ‘గేమ్ ఛేంజర్’ కోసం తన విడుదల తేదీని త్యాగం చేశారు చిరు.
అలా వాయిదాపడిన ‘విశ్వంభర’ సినిమాను జులై 24 లేదా ఆగస్ట్ 21న విడుదల చేసే అవకాశం ఉందని తెలుగుసినిమా.కామ్ ఇదివరకే వెల్లడించింది. ఇప్పుడదే నిజమైంది. జులై 24న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
దీని వెనక ఓ సెంటిమెంట్ కూడా నడిచింది. గతంలో ఇదే తేదీకి ‘ఇంద్ర’ సినిమా వచ్చింది. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అందుకే సెంటిమెంట్ ప్రకారం, అదే తేదీకి ‘విశ్వంభర’ ను విడుదల చేయాలనుకుంటున్నారు.
ALSO READ: Lord Shri Ram’s link to Megastar’s ‘Vishwambhara’
త్వరలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలుపెడతారు. ముందుగా ఓ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఇందులో సాయిదుర్గ తేజ్ కూడా నటించాడు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…
గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…
అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…
"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…
ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలుగునాట సరికొత్త రాజకీయ రికార్డు నెలకొల్పారు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…