డాలీ ధనుంజయ్ అంటే వెంటనే గుర్తురాకపోవచ్చు. అదే ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డి అంటే ఠక్కున గుర్తొస్తాడు. అతడే ఇతడు. ఇప్పుడీ నటుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లాడబోతున్నాడు జాలిరెడ్డి. ఆమె పేరు ధన్యత. వీళ్లిద్దరూ క్లాస్ మేట్స్. మైసూర్ లో చదువుకుంటున్నప్పుడు ఏళ్లుగా పరిచయం. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్ల కిందట ధన్యత ఇంట్లో ఒప్పించాడట డాలీ.
అలా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా నిశ్చితార్థం పూర్తయింది. తనకు ఎంగేజ్ మెంట్ జరిగిన విషయాన్ని దీపావళి సందర్భంగా బయటపెట్టాడు డాలీ అలియాస్ జాలిరెడ్డి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వీళ్ల వివాహం గ్రాండ్ గా జరగనుంది. అదే రోజు సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటుచేశారు.
‘పుష్ప’ సినిమాలోని జాలిరెడ్డి పాత్రతో టాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు డాలీ ధనుంజయ్. ఆ సినిమా సక్సెస్ తర్వాత అతడు నటించిన పలు కన్నడ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి కూడా. ప్రస్తుతం ఈ నటుడు, సత్యదేవ్ తో కలిసి ‘జీబ్రా’ అనే సినిమా చేశాడు. ఈ నెల్లోనే ఆ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఇక ‘పుష్ప-2’ డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…