మెగా కాంపౌండ్ కు పెద్ద దిక్కు చిరంజీవి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న మెగా హీరోలంతా చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లే. ఇప్పటికీ తన కుటుంబంలోని చాలామంది కెరీర్స్ కు బ్యాక్ బోన్ గా నిలుస్తున్నారు చిరంజీవి.
ఇప్పుడు చిరంజీవిలో కొత్త కోణాన్ని బయటపెట్టాడు హీరో వరుణ్ తేజ్. తమ కుటుంబంలో ది బెస్ట్ క్రిటిక్ ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి మాత్రమే అంటున్నాడు ఈ హీరో. మరీ ముఖ్యంగా తన సినిమాల వరకు చిరంజీవి ఎనాలసిస్ సూపర్ అనేది ఇతడి మాట.
“మా ఫ్యామిలీలో బెస్ట్ క్రిటిక్ పెదనాన్న చిరంజీవి గారే. ఆయనకు సమయం, సందర్భం బాగా తెలుసు. రిలీజైన వెంటనే పిలిచి వాయించేయరు. సరైన టైమ్ లో పిలిచి నా సినిమాలపై అప్పుడప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేస్తారు. నాకే కాదు, మా ఫ్యామిలీలో అందరికీ బెస్ట్ క్రిటిక్ ఆయనే.”
‘మట్కా’ సినిమాలో చాలా చోట్ల నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తాడు వరుణ్. దీనిపై స్పందించిన ఈ హీరో.. నెగెటివ్ షేడ్స్ లో కనిపించినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అంటున్నాడు. “వాసు అనే పాత్రను మెచ్చుకుంటారు కొందరు, మరికొందరు బాగా తిట్టుకుంటారు, కానీ అతడితో ట్రావెల్ చేస్తారు. మాకు కావాల్సింది అదే.” అంటూ స్పందించాడు. 14న థియేటర్లలోకి వస్తోంది ‘మట్కా’.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…