‘క’ సినిమాలో కృష్ణగిరి అనే ఊరును చూపించారు. ఏదో పేరు పెట్టాలి కాబట్టి పెట్టినట్టు కాకుండా, ఆ ఊరికి ఓ ప్రత్యేకతను కూడా ఆపాదించారు. ఆ ఊరికి చుట్టూ కొండలు ఉండడం వల్ల మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది. మరుసటి రోజు తెల్లారేవరకు అంతా చీకటే.
ఇలా ‘క’ సినిమాలో ప్రత్యేకమైన ఊరును పరిచయం చేసింది యూనిట్. అయితే ఆ ప్రత్యేకతను ఆపాదించడం వెనక కారణం ఏంటనేది మాత్రం సినిమాలో వెల్లడించలేదు. దీనిపై కిరణ్ అబ్బవరం స్పందించాడు.
‘క’ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన ఈ హీరో.. రెండో భాగంలో కృష్ణగిరి ఊరు వెనక స్టోరీని వెల్లడిస్తామని స్పష్టం చేశాడు. దర్శకులిద్దరూ ఆ ఊరు బ్యాక్ డ్రాప్ కు సంబంధించి మంచి లైన్ అనుకున్నారట. సీక్వెల్ ఆ లైన్ తో ప్రారంభమవ్వడంతో పాటు.. మరింత ఆసక్తికరంగా సాగుతుందని చెబుతున్నాడు.
దీపావళి బరిలో మరో 2 సినిమాలకు పోటీగా రిలీజైన ‘క’ మూవీ మంచి వసూళ్లు సాధిస్తోంది. టికెట్ రేట్లు తక్కువగా ఉండడం, పాజిటివ్ టాక్ రావడం సినిమాకు కలిసొచ్చింది.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…