జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని “పెద్ది” సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సరైన నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు రెండు నిమిషాల సన్నివేశాలను సినిమా నుంచి తొలగించి ప్రస్తుతం నిడివి తగ్గిన సినిమాని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
జాన్వీ కళ్ళ గురించి హీరో రామ్ చరణ్ చెప్తున్నప్పుడు ఆమె ఎద భాగం చూపించడం, పెదవులు, ముక్కు గురించి వర్ణిస్తున్నప్పుడు ఆమె నడుము, ఒంపుసొంపులు చూపిస్తూ ఎడిటింగ్ కటింగ్ చేశారు. దాంతో, చాలా విమర్శలు వచ్చాయి. అలాగే సినిమాలో ఇంకా కొన్ని అభ్యంతరకర డైలాగులు, పాటలో లిరిక్స్ ఉన్నాయి. కానీ ప్రధానంగా విమర్శలు ఎదుర్కున్న సన్నివేశాలను తొలగించారు.
ALSO READ: Buchi Babu apologises for Janhvi Kapoor’s portrayal, promises changes
ఈ సినిమా విడుదల తర్వాత జాన్వీ కపూర్ సైలెంట్ అయిపోయింది. ఆమె కూడా ఇబ్బందిపడినట్లు సమాచారం.
అలాగే దర్శకుడు బుచ్చిబాబు కూడా క్షమాపణలు కోరుతూ ఒక నోట్ పెట్టాడు సోషల్ మీడియాలో.
“పెద్ది” సినిమా ఇప్పుడు మూడో రోజు థియేటర్లలో నడుస్తోంది. మొదటి రెండు రోజులు భారీ వసూళ్లు అందుకొంది. ఈ శని, ఆదివారాలు కూడా మంచి కలెక్షన్లు ఉంటాయి.
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…