న్యూస్

సంతృప్తి లేదు, నిరాశ లేదు: మారుతి

దర్శకుడు మారుతి చాలా కామెంట్స్ ఎదుర్కొంటున్నారు. ఆయన తీసిన “ది రాజా సాబ్” చిత్రం నిన్న విడుదల అయింది. అసలే ప్రభాస్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ. వాళ్ళ అంచనాలు వేరు. మరి, ఈ సినిమాకి చాలా నెగెటివ్ కామెంట్లు రావడం, ముఖ్యంగా కామెడీ రైటింగ్, తీయడంపై విమర్శకులు చీల్చి చెండాడిన నేపథ్యంలో మారుతి ఒత్తిడిలో ఉన్నారు.

ఐతే అభిమానులు మాత్రం నిరాశ చెందలేదు ఈ సినిమా చూసి అనేది మారుతి అభిప్రాయం.

“వాళ్ళని ఈ సినిమా సంతృప్తి పరచలేదు. అలాగే నిరాశపర్చలేదు. వాళ్ళ అంచనాలు అందుకోలేకపోయాం. కానీ ప్రభాస్ ని కొత్తగా గ్లామర్ గా చూపించాం. వాళ్ళు కోరుకున్నది అదే. కాకపోతే ఇంకా బెటర్ గా తీయాల్సింది అనే మాట అంటున్నారు,” అని మారుతి విడుదలైన రెండో రోజు చేసిన కామెంట్ ఇది.

“ఏది ఏమైనా నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ ని కూడా ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా చేసిన మా హీరో ప్రభాస్ గారికి జన్మంతా రుణపడి ఉంటాను. ఇక ప్రభాస్ గారిని కొత్తగా చూపించాలని ప్రయత్నించాను. ముఖ్యంగా మైండ్ గేమ్స్ బాగా నచ్చింది చాలా మందికి. చివర్లో 40 నిమిషాలు అందరూ మెచ్చుకుంటున్నారు,” అని మారుతి అన్నారు.

ALSO READ: ది రాజా సాబ్ రివ్యూ: తడబడిన కథనం

“నేను కూడా ప్రభాస్ తో రెగ్యులర్ కమర్షియల్ కథ చెప్పొచ్చు. కానీ ఇలాంటి కథ, కొత్తదనం ఉన్న మైండ్ గేమ్స్ ఎపిసోడ్ లు పెద్ద హీరోతో కూడా చెయ్యాలి అనే ఉద్దేశంతో, ప్రభాస్ గారి ప్రోత్సాహంతో తీశాం. కొత్త పాయింట్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. రిజల్ట్ గురించి ఇప్పుడే ప్రకటించొద్దు. ఇప్పుడు సెకండాప్ఫ్ షార్ప్ చేశాం. ఆ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ కూడా పెట్టాం ఇప్పుడు. అది యాడ్ చేశాం. ఈ రోజు నుంచి ఉంటుంది థియేటర్లో,” మారుతి వివరణ ఇచ్చారు.

TeluguCinema

Recent Posts

Anantha Sriram: లిరిసిస్ట్ కి వసూళ్ల దురద ఎందుకు?

రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…

9 hours ago

ఒకే వారంలో 2 బ్లాక్ బస్టర్లు: Blast and Avatar 3

సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…

17 hours ago

Samantha తల్లి కాబోతోందని కన్ఫర్మ్ చేసిన చిరంజీవి

సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…

21 hours ago

Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…

1 day ago

Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!

"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…

2 days ago

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…

2 days ago