Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

ది రాజా సాబ్ రివ్యూ: తడబడిన కథనం

TeluguCinema, January 9, 2026January 10, 2026

ది రాజా సాబ్ – కథ ఏంటి?

రాజు… అందరికీ ప్రేమగా రాజా సాబ్. అమ్మమ్మ గంగమ్మతో కలిసి సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. గంగమ్మ మాటల్లో మాత్రం ఓ వింత ప్రపంచం దాగి ఉంటుంది. ఒకప్పుడు తమది రాజవంశమట, తన భర్త ఎప్పుడో అదృశ్యమైపోయాడట… మళ్లీ ఎప్పుడైనా తిరిగి వస్తాడనే ఆశతోనే ఆమె జీవిస్తుంది. పైగా ఆమెకి అల్జీమర్స్. దాంతో ఆమె చెప్పే వాటిని రాజాసాబ్ కొట్టిపడేస్తాడు.

అనుకోకుండా ఒక ఫొటోలో రాజాసాబ్ తన బామ్మ చెప్తున్న తాతని చూస్తాడు. అతనే తన భర్త అని బామ్మ చెప్పడంతో తాతని వెతుక్కుంటూ హైదరాబాద్‌కి బయలుదేరతాడు.

అక్కడ అతడి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఒకరు బెట్సీ – సన్యాసినిగా మరలనుకుంటున్న అమ్మాయి. మొదటి చూపులోనే రాజా సాబ్ మనసు జారిపోతుంది. మరోవైపు భైరవి… తన తాత జాడ తనకు తెలుసంటూ అతడి జీవితంలోకి అడుగుపెడుతుంది. వెతుకులాట స్నేహంగా మారుతుంది. బెట్సి తనకు దూరమైంది అని ఆమెకి దగ్గరికి అవుతాడు.

భైరవితో కలిసి నర్సాపూర్ అడవుల్లోకి వెళ్తాడు రాజాసాబ్. అక్కడ ఒక ఫ్యాలెస్ లో తాత ఉన్నాడని వెళ్తాడు. అడుగుపెట్టిన క్షణమే, వాళ్లందరికీ అర్థమవుతుంది – ఇది బయటకు వెళ్లే చోటు కాదు. ఈ మహల్‌లో కాలం, జ్ఞాపకం, ఆత్మలు అన్నీ కలిసిపోయిన ఓ వింత వలయం.

రాజా సాబ్ అక్కడినుంచి బయటపడతాడా? తన తాతను నిజంగా కనుగొంటాడా? లేక ఆ మహల్‌లోనే అతడూ బందీ అవుతాడా? ఇదే ది రాజా సాబ్ కథా ప్రయాణం.

ది రాజా సాబ్

ది రాజా సాబ్ విశ్లేషణ

మారుతి దర్శకత్వంలో వచ్చిన “ది రాజా సాబ్” ప్రభాస్‌కు పూర్తిగా భిన్నమైన ప్రయత్నం. హారర్-కామెడీ జోనర్ లో ఆయనను చూడటం కొత్తగా అనిపిస్తుంది. ఐడియా పరంగా ఇది బానే ఉంది. కానీ కథనమే పెద్ద సమస్య. ఈ సినిమా సత్య క్యారెక్టర్ తో మొదలై ఒక మంచి హారర్ మూవీ ఫీలింగ్ ని సెట్ చేస్తుంది. ఆ తర్వాత హీరో ప్రభాస్ ఎంట్రీ ఇస్తారు. ముందు ఒక హీరోయిన్ (రిద్ధి కుమార్)తో సీన్లు, ఆ తర్వాత మరో హీరోయిన్ (నిధి అగర్వాల్), ఆ తర్వాత ఇంకో హీరోయిన్ (మాళవిక). ఒక్కో హీరోయిన్ ఒక్కో పాట. ఒక మాస్ హీరో ముగ్గురు హీరోయిన్లతో సరసాలు ఆడడం, పాటలు పాడడం అనేది చాలా అవుట్ డేటెడ్ స్టఫ్.

ప్రభాస్ ని మంచి గ్లామర్ గా, రొమాంటిక్ హీరోగా చూపించాలనేది ఐడియా. ఎందుకంటే ప్రభాస్ వరుసగా భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో అభిమానులకు కావాల్సిన రొమాంటిక్ సీన్లు, సాంగ్స్ పడడం లేదు అని ప్రభాస్ అనుకున్నాడు. అందుకే, ఈ సినిమాని సెట్ చేశాడు. ఆ ఆలోచన తప్పు కాదు కానీ, ఆ రొమాంటిక్ సీన్లలో బలం లేకపోవడం, ఏ హీరోయిన్ తో హీరోకి కెమిస్ట్రీ కుదరకపోవడంతో పెద్ద బోర్ అయిపోయింది.

ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్స్ చుట్టూనే తిరుగుతూ నెమ్మదిగా సాగుతుంది. కొన్ని చోట్ల అయితే పూర్తిగా విసుగును కలిగిస్తుంది. మారుతి సినిమాల్లో ఉండే సహజమైన కామెడీ కూడా మిస్ అయింది. నవ్వించాల్సిన సీన్స్… చిరాకు తెప్పిస్తాయి.

సినిమాలో చెప్పుకోదగ్గ ఎపిసోడ్ ద్వితీయార్థంలో వస్తుంది. దెయ్యంగా మారిన తాత రాజా సాబ్‌ని తన వలలో బంధించే పద్దతి, ఇప్నటైజ్ చేసి ఆ ప్యాలెస్ నుంచి బయటపడకుండా చేసే ఎపిసోడ్ బాగుంది. సప్త చక్రాల సహాయంతో ప్రభాస్ బయటపడే ప్రయత్నం చేసే ట్రాక్ బాగానే వర్క్ అవుతుంది. ముఖ్యంగా అమ్మమ్మను కాపాడేందుకు ప్రభాస్ చేసే పోరాటం సినిమాకి ప్రాణం పోస్తుంది. కానీ, ఈ బలం అంతా చివరి అరగంటకే పరిమితం అవుతుంది. మిగతా భాగాల్లో అదే స్థాయి రైటింగ్ లేకపోవడం పెద్ద మైనస్.

సెకండాఫ్ లో ఈ ప్యాలెస్ కి అందరూ ఒకరు వెనుక ఒకరు వస్తారు, బొమన్ ఇరానీ, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్, సప్తగిరి… అదేదో ప్రభాస్ వాళ్లకు తన లొకేషన్ ని మొబైల్ లో షేర్ చేసినట్లు. హీరోయిన్ మాళవిక మంచిగా ముస్తాబై, రకరకాల చీరలు కట్టుకొని ఆ ప్యాలెస్ లో రోజుల తరబడి ఉంటుంది. కానీ సప్తగిరి బొంతతో అన్ని రోజులు తిరుగుతూ ఉంటాడు. ప్రభాస్ సీన్ షాక్ తో మాడిపోయిన ఫేస్ తోనే ఉంటాడు. అంతా సిల్లీగా ఉంటుంది.

సెట్స్ వైభవంగా ఉన్నా, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని చోట్ల ఆశించిన స్థాయిలో లేవు. అయితే VFX కంటే ఎక్కువగా సినిమాను దెబ్బతీసింది – బోరింగ్ రొమాంటిక్ సీన్స్, ఫ్లాట్ కామెడీ.

ప్రభాస్ మాత్రం ఈ పాత్రని ఆస్వాదించినట్టు కనిపిస్తాడు. ప్రీ-క్లైమాక్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్లు ఫుల్లుగా ఎక్స్పోజింగ్ చేశారు. జరీనా వాహబ్ బామ్మగా బాగానే మెప్పించారు. సంజయ్ దత్ పాత్రలో దమ్ము లేదు కానీ అతని నటన ఫర్వాలేదు. బోమన్ ఉన్నంతసేపు ఒకే అనిపిస్తారు.

థమన్ సంగీతం ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా సంతృప్తికరంగానే ఉంది.

చివరగా చెప్పాలంటే…

“ది రాజా సాబ్”లో బేసిక్ పాయింట్ బాగుంది కానీ నేరేషన్ బోరింగ్ గా ఉంది. హారర్‌గా పూర్తిగా భయపెట్టదు, కామెడీగా పూర్తిగా నవ్వించదు. హారర్ గా మొదలై, రొమాంటిక్ గా సాగి, కామెడీగా అటు ఇటు తిరిగి సైకలాజికల్ థ్రిల్లర్ గా ముగిసి… రెండో భాగం కూడా ఉందని చెప్పి ఎండ్ అవుతుంది. అలా కంగాళీగా మారిపోయింది. మారుతీ జనరల్ గా కామెడీ బాగా తీస్తారు. కానీ ఇందులో అయన కామెడీ పండలేదు. అందుకే ఈ రాజా అటు రాజా కాలేదు ఇటు సాబ్ కాలేదు.

రేటింగ్: 2.25/5

సినిమా పేరు: ది రాజా సాబ్

విడుదల తేదీ: జనవరి 2026 (సంక్రాంతి సీజన్)

భాష: తెలుగు

దర్శకుడు: మారుతి

నటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్

ముఖ్య పాత్రలు: సంజయ్ దత్, బోమన్ ఇరానీ

సంగీతం: ఎస్.ఎస్. థమన్

సినిమాటోగ్రఫీ: కార్తిక్ పళని

జానర్: హారర్ – కామెడీ

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే

Recent News

  • రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj
  • OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్
  • The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Samantha: అవును, మెటర్నిటీ బ్రేక్ తీసుకోబోతున్నా
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes