
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన “టాక్సిక్” సినిమా పూర్తి చేసింది. ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఇక తెలుగులో ఎన్టీఆర్ సరసన “డ్రాగన్” చిత్రం చేస్తోంది. ఇప్పుడు రజినీకాంత్ చిత్రం ఆమె ఖాతాలో చేరేలా ఉంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న 173వ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకొస్తున్నాయి. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను కమల్ హాసన్ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్ గా సిమ్రాన్ ను తీసుకున్నారు. రజినీకాంత్ సరసన సిమ్రాన్ నటిస్తున్నారు. ఇక ఒక కీలక పాత్రలో రాశి ఖన్నా నటించనుంది. ఇప్పుడు ఈ సినిమాలోకి ‘కాంతర’ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా చేరినట్టు టాక్.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వస్తున్న ఈ సినిమాపై ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్‌లో రజినీకాంత్ చేతిలో సర్జికల్ బ్లేడ్ పట్టుకుని, రక్తంతో తడిసిన చేతులతో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించి అందరికీ మైండ్ బ్లాక్ చేశారు. వినూత్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ ప్రాజెక్టులోకి రుక్మిణి చేరడం మరింత క్రేజ్ తెచ్చుకుంది.
రుక్మిణి ఈ సినిమాలో ఏ పాత్ర పోషించనుంది అనేది ఆసక్తికరమే. ఆమె రజినీకాంత్ కి జోడిగా ఐతే నటించడంలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు.
