Categories: న్యూస్

‘గేమ్ ఛేంజర్’ మెగాస్టార్ రివ్యూ

రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక రివ్యూ వచ్చేసింది. దర్శకుడు సుకుమార్, ‘గేమ్ ఛేంజర్’ ఎలా ఉంటుందో చెప్పేశాడు.

అమెరికాలోని డాలస్ లో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు స్పెషల్ గెస్ట్ గా హాజరైన సుక్కూ, సినిమా గురించి మాట్లాడాడు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ అయితే బ్లాక్‌బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్ సూపర్ అని మెచ్చుకున్నాడు. క్లైమాక్స్‌లో రామ్ చరణ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కు జాతీయ అవార్డు గ్యారెంటీ అన్నాడు.

ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ కు సంబంధించి మరో రివ్యూ బయటకొచ్చింది. ఈసారి సినిమాపై చిరంజీవి రివ్యూ ఇచ్చారు. విజయవాడలో ఏర్పాటుచేసిన భారీ రామ్ చరణ్ కటౌట్ ను నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించే పనిలో ఉంటుంటే, ఇటు హైదరాబాద్ లో చిరంజీవి ‘గేమ్ ఛేంజర్’ సినిమా చూశారు.

సినిమా చూసిన వెంటనే దిల్ రాజుకు ఫోన్ చేశారు. ఆ టైమ్ లో దిల్ రాజు, బెజవాడలో మెగాభిమానుల మధ్య ఉన్నారు. సినిమా చూసిన చిరంజీవి, ఈ సంక్రాంతి మామూలుగా ఉండదని అన్నారట. చిరంజీవి ఒక్కో సీన్ గురించి చెబుతూ, చాలా ఆనందం వ్యక్తం చేశారంట. దర్శకుడు శంకర్ నాలుగేళ్ల కిందట కథ చెబుతున్నప్పుడు ఎలా ఫీలయ్యానో, చిరంజీవి రివ్యూ ఇస్తున్నప్పుడు అంతే ఫీలయ్యానని అంటున్నాడు దిల్ రాజు.

Admin

Recent Posts

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…

2 hours ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

2 hours ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

2 days ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

2 days ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

2 days ago