ఆ సినిమానే కదా హనూ!

చాన్నాళ్ల కిందటి సంగతి.
“కృష్ణగాడి వీరప్రేమగాథ” సినిమా తర్వాత నాని, దర్శకుడు హను రాఘవపూడి కలిసి మరో సినిమా చేద్దామనుకున్నారు. నాని కోసం హను అప్పట్లో ఓ కథ కూడా రాసుకున్నాడు. అదొక మిలట్రీ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్. బాగా హార్డ్ వర్క్ చేయాల్సిన ప్రాజెక్టు. కాబట్టి అప్పటికప్పుడు ఈ సినిమాను టేకప్ చేయడం సాధ్యం కాదని స్వయంగా నాని ప్రకటించాడు. పైగా అప్పటికి అతని చేతిలో మరో 3 సినిమాలున్నాయి.

అలా ఏళ్లు గడిచినా నాని-హను కాంబో మాత్రం మళ్లీ రిపీట్ కాలేకపోయింది. కట్ చేస్తే, హను రాఘవపూడి ఇప్పుడో సినిమాను ప్రకటించాడు. దుల్కర్ సల్మాన్ హీరో. ఇదొక మిలట్రీ బ్యాక్ డ్రాప్ సినిమా. అతడి మాటల్లోనే చెప్పాలంటే యుద్ధంతో రాసిన ప్రేమకథ ఇది. ఈరోజు ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చిన వెంటనే అందరికీ ఆరోజు నాని-హను కాంబోలో రావాల్సిన సినిమా గుర్తొచ్చింది. అప్పట్లో నాని కోసం అనుకున్న సబ్జెక్ట్ తోనే ఇప్పుడు దుల్కర్ హీరోగా హను సినిమా ప్రకటించాడని అంటున్నారు కొంతమంది.

దీనిపై ఇద్దరు మాత్రమే క్లారిటీ ఇవ్వగలరు. ఒకరు దర్శకుడు హను. రెండు హీరో నాని.

TeluguCinema

Recent Posts

కమల్ హాసన్ కి కూతురు Shruti Haasan సపోర్ట్

కమల్ హాసన్ (Kamal Haasan) ఇటీవల చెన్నైలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో పాల్గొని, ఏఐ వల్ల పర్యావరణంపై పడుతున్న…

6 hours ago

Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!

తల్లి అయిన తర్వాత తన సినిమాల ఎంపికలో మార్పు వచ్చిందని నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) వెల్లడించారు. ఆమె…

6 hours ago

ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) యాక్టింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలతో తన టాలెంట్ నిరూపించుకుంది. అయితే…

1 day ago

ఈసారి తన కొడుకు హిట్ కొడుతాడు అంటోన్న Nagarjuna

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన "లెనిన్" (Lenin) చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి,…

1 day ago

అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela

ఇప్పటికే లవ్ లైఫ్, పెళ్లి, డేటింగ్ లాంటి అంశాలపై ఓపెన్ గా స్పందించింది శ్రీలీల (Sreeleela). ఎప్పుడూ పక్కనే అమ్మ…

1 day ago

ఆ సినిమా రిజెక్ట్ చేశాను: Bhagyashri Borse

'ఎల్లమ్మ' (Yellamma) సినిమా కోసం చాలామంది హీరోయిన్లను అనుకున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి పేరు తెరపైకొచ్చింది.…

1 day ago