Lenin postponement: అఖిల్ అక్కినేని సినిమా అంటేనే ఆగిపోవడం, వాయిదా పడడం అన్నట్లుగా ఉంది. దానికి తోడు నిర్మాత నాగవంశీ తీసే సినిమాలు కనీసం మూడు, నాలుగుసార్లు వాయిదాపడడం వెరీ కామన్. ఇప్పుడు అఖిల్ అక్కినేని హీరోగా నాగవంశీ నిర్మిస్తున్న “లెనిన్” చిత్రం కూడా అదే ఫేస్ చేస్తోంది.
అఖిల్ అక్కినేని హీరోగా ఏడాది క్రితం “లెనిన్” సినిమాని మొదలుపెట్టారు. సినిమా మధ్యలో ఆగిపోయింది. హీరోయిన్ గా నటించిన శ్రీలీల సినిమా నుంచి తప్పుకొంది. అలాగే తన పెళ్లి కోసం కూడా షూటింగ్ ఆపేశాడు అఖిల్. మళ్ళీ భాగ్యశ్రీ బోర్స్ ని తీసుకొని ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభించారు.
ఈ ఏప్రిల్ లో సినిమాని విడుదల చేస్తామని నిర్మాత ఘనంగా ప్రకటించారు. తీరా చూస్తే ఇప్పుడు ఏప్రిల్ 3న బైకర్, ఏప్రిల్ 10న డెకాయిట్, స్వయంభు చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఏప్రిల్ 30న పెద్ది వస్తోంది. మధ్యలో ఒక్క ఏప్రిల్ 17 మాత్రమే మిగిలి ఉంది.
అందుకే ఇన్ని సినిమాల మధ్య నలిగిపోవడం కన్నా వాయిదా వెయ్యడం కరెక్ట్ అని టీం భావిస్తోందిట.
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…