సంక్రాంతి సినిమాల సందడి తగ్గిన తర్వాత మళ్ళీ కొత్త సినిమాల ఊపు తగ్గింది. ఫిబ్రవరి మొదటి వీకెండ్ ని టార్గెట్ చేస్తూ చాలా సినిమాలు వస్తున్నాయి. ఐతే, రిలీజ్ కానున్న ఈ సినిమాలన్నీ చిన్న చిత్రాలే. పెద్దగా జనాల్లో క్రేజ్ లేని నటుల చేసినవే ఉన్నాయి. ఈ వీకెండ్ బరిలో ఉన్న చిత్రాలేంటో చూద్దాం.
యుఫోరియా
ఒక్కడు, రుద్రమదేవి, అర్జున్, చూడాలని ఉంది వంటి పెద్ద చిత్రాలు తీసిన దర్శకుడు గుణశేఖర్ నేటి తరాన్ని టార్గెట్ చేస్తూ యూత్ ఫుల్ సినిమా చేశారు. అదే… యుఫోరియా. భూమిక కీలక పాత్ర. కానీ మెయిన్ లీడ్ రోల్స్ చేసినవాళ్లు అంతా కొత్త వాళ్లే. అందులో కాస్త పాపులర్ ఫేస్… సారా అర్జున్. ఈ భామ ఇటీవల “ధురంధర్” సినిమాతో పేరు తెచ్చుకొంది. ఫిబ్రవరి 6న విడుదల అవుతోంది యుఫోరియా.
శ్రీ చిదంబరం గారు
ఫిబ్రవరి 6న విడుదల అవుతోన్న మరో చిత్రం… శ్రీ చిదంబరం గారు. వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ జంటగా నటించిన ఈ సినిమా గ్రామీణ ప్రాంత ప్రేమకథ.
హానీ, సుమతి శతకం, విత్ లవ్
దివి వాడ్తా, నవీన్ చంద్ర జంటగా నటించిన “హానీ”, డబ్బింగ్ మూవీ “విత్ లవ్”, మరో తెలుగు చిత్రం సుమతి శతకం కూడ ఈ వీకెండ్ కి వస్తున్నాయి. మొత్తంగా ఐదు చిత్రాలు బరిలో ఉన్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అవుతున్న ఈ సినిమాల్లో ఏది సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…