ఫీచర్లు

Part 2 Movies: ఆలస్యం, అనవసరం!

Part 2 Movies: Devara 2, Kalki 2, Salaar 2, Jai HanuMan

ఒక సినిమా హిట్ కాకముందే దానికి రెండో భాగం ముందే ప్రకటిస్తున్నారు మన దర్శక, నిర్మాతలు. ఐతే, ఒక ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలు తప్ప మిగతా పెద్ద సినిమాలేవీ రెండో భాగం వెంటనే తీయలేదు. పేరుకే రెండో భాగం అని ప్రకటించి వాటిని అలా సంవత్సరాల తరబడి పొడగిస్తున్నారు. ఈ గ్యాప్ లో ఆ హీరోలు వేరే సినిమాలు చేసుకుంటున్నారు.

కొన్ని సినిమాలను ఆలస్యంగా మొదలుపెడుతున్నారు. ఆలస్యం మాములు ఆలస్యం కాదు.. మూడేళ్ళ తర్వాతే. ఇంకొన్నిటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. పార్టు 2 అనవసరం అని.

కల్కి 2

ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ చిత్రాలతోనే రెండు భాగాల చిత్రాలకు క్రేజ్ వచ్చింది. కానీ ఆయనే ఇప్పుడు రెండో భాగం చేసేందుకు అంత ఆసక్తి చూపడం లేదు. “కల్కి 2898 AD” అంత పెద్ద హిట్ అయినా వెంటనే ఆ సినిమాకి రెండో పార్టు చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు “ది రాజాసాబ్” ఫ్లాప్ అయిన తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నెలలోనే “కల్కి 2” మొదలు కానుంది.

దేవర 2

ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమా హిట్టే. కానీ వెంటనే “దేవర 2” చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. గ్యాప్ లో “వార్ 2” పూర్తి చేశాడు. అది పోయింది. తాజాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో “డ్రాగన్” మూవీలో నటిస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ సినిమా కూడా ఒప్పుకున్నాడు. త్రివిక్రమ్ సినిమా ఉంటుందా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ పక్కన పడేసిన “దేవర 2″ని ఈ ఏడాదే మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఆలస్యంగానే స్టార్ట్ అవుతోంది.

జై హనుమాన్

“హనుమాన్” సినిమా విడుదలై ఇప్పటికే రెండేళ్లు అవుతోంది. ఇప్పటివరకు దానికి రెండో పార్ట్ గా ప్రకటించిన “జై హనుమాన్” మొదలు కాలేదు. ఆ దర్శకుడు సినిమా మరోటి రాలేదు.

హరి హర వీర మల్లు 2

పవన్ కళ్యాణ్ నటించిన “హరి హర వీర మల్లు” సినిమా మొదటి భాగం గత సంవత్సరం విడుదలైంది. రెండో భాగం ఘనంగా ప్రకటించారు. కానీ దీనికి రెండో పార్ట్ అనవసరం. అందుకే దీన్ని పక్కన పెట్టారు.

సలార్ 2

“సలార్” భారీ విజయం సాధించింది. ఐతే, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ ఇద్దరూ కొంత గ్యాప్ తీసుకోవాలనుకున్నారు. అందుకే, “సలార్ 2” ఇన్నేళ్ల అయినా మొదలు కాలేదు. ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది. “సలార్” 2023లో విడుదలైంది. అంటే రెండో భాగం నాలుగేళ్ల తర్వాత మొదలు కానుంది.

TeluguCinema

Recent Posts

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

4 hours ago

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

1 day ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

1 day ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

2 days ago

Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్

సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…

2 days ago

Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…

2 days ago