తమిళ చిత్రరంగంలో అతి పెద్ద హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది “కూలీ”. ఇక 2025లో నెంబర్ వన్ వసూళ్లు పొందిన తమిళ చిత్రం కూడా ఇదే. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఐతే, ఈ విజయం అటు లోకేష్ కి, ఇటు రజినీకాంత్ కి ఎక్కువ ఆనందాన్ని ఇవ్వలేదు.
ఎందుకంటే, ఈ సినిమాకి వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. సినిమా లక్ లో ఆడింది తప్ప మెరిట్ లో కాదు అని చాలామంది భావన. రజినీకాంత్ అభిమానులు కూడా లోకేష్ ని విమర్శించారు. దాంతో, ఇకపై ఇలాంటి తప్పులు చెయ్యను అని తాజాగా దర్శకుడు లోకేష్ అన్నాడు.
“ఈ సినిమాకి 1000 విమర్శలు వచ్చాయి. చాలా కామెంట్స్ చూసాను. ఇకపై ఇలాంటి తప్పులు చెయ్యను. ఐతే, సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు అందుకొంది. ఆ విధంగా ఆనందమే. నా తదుపరి చిత్రంలో ఇలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వను,” అని లోకేష్ తెలిపాడు.
ఐతే, లోకేష్ తదుపరి చిత్రం ఏంటనేది పెద్ద సస్పెన్స్.
“కూలీ” సినిమా విడుదలకు ముందు రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా అనీ, “ఖైదీ 2” అనీ, అమీర్ ఖాన్ తో సినిమా అనీ, ప్రభాస్ తో సినిమా అనీ ఇలా చాలా ప్రచారం జరిగింది. తాజాగా అల్లు అర్జున్ ని కలిసి కథ చెప్పినట్లు న్యూస్ బయటికి వచ్చింది. కానీ ఆయన తదుపరి చిత్రం పక్కాగా ఇదే అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన కూడా ప్రకటించలేకపోతున్నాడు.
రామ్ చరణ్ నటించిన పెద్ది (Peddi) సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ వసూళ్లు చేసింది. ఐతే ఈ సినిమా…
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…