తన సినిమాల్లో హీరోల్ని కొత్తగా చూపించడం పూరి జగన్నాధ్ కు చాలా ఇష్టం. కుదిరితే సిక్స్ ప్యాక్ లో చూపిస్తాడు. కుదరకపోతే కనీసం హెయిర్ స్టయిల్ అయినా మారుస్తాడు. మరి ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తున్న బాలయ్య.. ఎలా కనిపిస్తాడనే క్యూరియాసిటీ బాగానే ఉంది. ఆ క్యూరియాసిటీకి తగ్గట్టే బాలయ్య నయా పిక్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.
ఫొటో చూస్తుంటే బాలయ్య కాస్త కొత్తగానే కనిపిస్తున్నాడు. కాకపోతే ఇది పూరి సినిమాలో స్టిల్ అవునా కాదా అనేది పెద్ద డౌట్. చాలామంది మాత్రం బాలయ్య 101వ సినిమాలో గ్యాంగ్ స్టర్ గెటప్ ఇదేనంటూ ప్రచారం చేస్తున్నారు.
ఎల్లుండి పోర్చుగల్ కు బయల్దేరుతున్నాడు బాలయ్య. అక్కడే 40రోజుల పాటు షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ లో ఈ గెటప్ తోనే షూట్ చేయబోతున్నారట. ఫొటో చూస్తుంటే, గ్యాంగ్ స్టర్ గెటప్ కు సరిగ్గా సరిపోయింది. కాకపోతే ఫైనల్ లుక్ ఇదేనా, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా అనేది తేలాలి. శ్రియ, ముష్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ అనుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన "ఓజీ" (OG) చిత్రం భారీ విజయం…
బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…
నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…
గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…
అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…
"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…