'అంధ‌గాడు' పాటల సంద‌డి

రాజ్‌త‌రుణ్ హీరోగా రూపొందుతోన్న కొత్త‌ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం ఆడోర‌కం త‌ర్వాత‌ రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్న సినిమా ఇది. టైటిల్‌లోనే హీరో క్యార‌క్ట‌ర్ ఏంటో చెప్పేశారు. అదేనండి..సినిమాలో హీరోకి క‌ళ్లు క‌న‌ప‌డ‌వు. 

ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు.  డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌  సినిమాకు వ‌న్ ఆఫ్ ది హైలైట్ కానుంద‌ని టీమ్ చెపుతోంది.  సోష‌ల్ మీడియాలో, ఎఫ్‌.ఎం. స్టేష‌న్స్‌లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈరోజు నుండి ఒక్కొక్క సాంగ్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

రాజ్ త‌రుణ్‌, హెబ్బా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అన్న పుకార్ల సంగ‌తెలా ఉన్నా.. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగుంటుంద‌ని ప్రేక్ష‌కులు ఇప్ప‌టికే రెండు సినిమాల్లో తీర్మానించారు. మ‌రి మూడో సినిమాలోనూ వీరి కెమిస్ట్రీ  వ‌ర్క‌వుట‌యి …నిర్మాత‌కి ఎకనామిక్స్ వ‌ర్క‌వ‌ట్ చేస్తుందా అనేది చూడాలి.

TeluguCinema

Recent Posts

OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Sujeeth) కాంబినేషన్ లో వచ్చిన "ఓజీ" (OG) చిత్రం భారీ విజయం…

3 hours ago

Pawan Kalyan and Ram Charan: బాబాయ్-అబ్బాయ్, పిక్చర్ పర్ ఫెక్ట్

బాబాయ్-అబ్బాయ్ కలుసుకోవడం కొత్తేం కాదు. మినిమం గ్యాప్ లో ఇద్దరూ కలుసుకుంటూనే ఉంటారు. తమ షెడ్యూల్స్ తో ఎంత బిజీగా…

5 hours ago

The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు

నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' (The Paradise) సినిమా నుంచి 'ఆయా షేర్' అనే సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్టయింది.…

18 hours ago

Samantha: అవును, మెటర్నిటీ బ్రేక్ తీసుకోబోతున్నా

గత కొన్ని వారాలుగా సమంత (Samantha) గర్భవతి అనే వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు…

18 hours ago

‘Alpha’ నాకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్: అలియా భట్

అలియా భట్ (Alia Bhatt) నటించిన మొదటి యాక్షన్ చిత్రం.. ‘ఆల్పా’ (Alpha). ఇండియాలో ఇంతకుముందెప్పుడూ హీరోయినే స్పైగా ప్రధాన…

22 hours ago

Janhvi Kapoor: పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా?

"పెద్ది" (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన…

1 day ago