‘నేనెక్కడున్నా’ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న ‘నేనెక్కడున్నా’ విడుదల కానుంది.
“ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. మహిళా సాధికారిత, మహిళా జర్నలిజం గురించి మాత్రమే చెప్పలేదు. ఇందులో పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. దర్శకుడు మాధవ్ కోదాడ ముంబై వచ్చి నాకు కథ చెప్పారు. కథ విన్న వెంటనే ‘ఎస్’ చెప్పాను. మంచి సందేశంతో కూడిన ఫిల్మ్ మాత్రమే కాదు… నాకు తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని అనుకున్నాను,” అని తెలిపారు మిమో.
హీరోగానే కాదు విలన్ పాత్రలకు కూడా మిమో సిద్ధం అంటున్నారు.
మిథున్ చక్రవర్తి ఇప్పటికే తెలుగులో ‘గోపాల గోపాల’ చిత్రంలో చేశారు. “మా నాన్నఇప్పుడు భాస్ గారి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్నారు. మేం తండ్రికొడుకుల్లా కాకుండా స్నేహితులుగా ఉంటాం. బయట జనాలకు ఆయన సూపర్ స్టార్. కానీ, నాకు ప్రాక్టికల్ ఫాదర్ అని చెప్పాలి,” అని మిమో వివరించారు.
“పవన్ కళ్యాణ్, ప్రభాస్, దళపతి విజయ్ అంటే ఇష్టం. రజనీకాంత్ అన్నా ఇష్టమే,” అని తన ఫెవరెట్స్ గురించి చెప్పారు.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…