పవన్ కళ్యాణ్ రాజకీయ నేతగా బిజీగా ఉన్నారు. ఒక రోజు ఎదో ఒక దీక్ష అని ఓ కేరళలో కనిపిస్తారు. మరో రోజు తమిళనాడుకి వెళ్తారు. ఒక నాడు కుంభమేళాలో దర్శనమిస్తారు. ఇంకోనాడు అపోలో హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటూ హైదరాబాద్ లో అగుపిస్తారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఉన్నారు. నిత్యం బిజీ బిజీ.
బీజేపీ మిత్రపక్ష కూటమిలో కీలక నాయకుడిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు తీరిక లేదు. సినిమాలు చెయ్యాల్సిన అవసరమూ లేదు. కాకపోతే, ఒప్పుకున్న చిత్రాల షూటింగ్ లు పూర్తి చెయ్యాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆయన విడుదలకి సిద్ధంగా ఉన్న “హరి హర వీర మల్లు” చిత్రం పూర్తి చెయ్యాలి.
ఈ సినిమాకి సంబంధించి మిగిలిన 10 రోజుల పని కంప్లీట్ చెయ్యాలి. ఆ డేట్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వడం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డూప్ తో చాలా వరకు లాగారు. కానీ కొన్ని కీలకమైన సన్నివేశాలకు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వెళ్లాల్సిందే. వచ్చే నెల మొదటి వారంలో ఆ మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తామని నిర్మాత నమ్మకంగా ఉన్నారు.
అది పూర్తి అయితే “హరి హర వీర మల్లు” ఈ వేసవిలో విడుదల అవుతుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ మాత్రం జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు పాటలు విడుదల అయ్యాయి.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…