రవితేజ, శ్రీలల జంటగా నటించిన “ధమాకా” మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రవితేజ నటించిన సినిమా ఏదీ ఆడలేదు. అందుకే, రవితేజ ఆ సినిమాకి సీక్వెల్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ సినిమా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
“రవితేజ గారితో డబుల్ ధమాకా చేస్తే బావుంటుంది అనే ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నాను. సీక్వెల్ ఐడియా దానికే కాదు ఇప్పుడు చేసిన “మజాకా”కి కూడా ఉంది. మజాకా చివర్లో డబుల్ మజాకా అని వేశాం. అయితే మరో టైటిల్ తో వెళ్ళాలా ఇదే టైటిల్ తో అన్నది తర్వాత డిసైడ్ చేస్తాం,” అని తెలిపారు త్రినాథరావు.
మరోవైపు, “మజాకా” సినిమాకి మలయాళ సినిమా “బ్రో డాడీ”కి పోలికలు ఉన్నాయి అనే వాదన ఉంది. కానీ అది తప్పు అంటున్నారు త్రినాధరావు.
“నేను ఆ సినిమా చూశాను. ఆ కథే వేరు ఇది వేరు. మజాకా కథని సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. వాళ్ళింట్లో ఎప్పటికైనా ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవాలనుకునే తపన పడే ఆడదిక్కులేని ఇద్దరు మగాళ్ల గురించి ఈ సినిమా. ఈ సినిమా చివరి ఇరవై నిముషాలు చాలా ఎమోషనల్ గా సాగుతుంది. ముందు అంతా వినోదమే,”అని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…