ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శింఛుకున్నారు హీరోయిన్ నయనతార (Nayanthara), ఆమె భర్త విగ్నేష్ శివన్. రేపు ఆమె భర్త డైరెక్ట్ చేసిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” (LIK) తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించారు.
భర్త ఈ సినిమాకి డైరెక్టర్ కావడం, తాను సహ నిర్మాత కావడంతో నయనతార ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే సినిమా విజయం కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అందుకే.
నయనతార ఇంతకుముందు తానే హీరోయిన్ గా, సమంత మరో హీరోయిన్ గా ఒక సినిమా నిర్మించింది. ఐతే, ఈ సినిమా విజయం వీరికి ముఖ్యం. ప్రదీప్ రంగనాథన్ మంచి సక్సెస్ లో ఉన్నాడు. క్రేజ్ ఉంది అతనికి. కానీ ఈ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అనేకసార్లు వాయిదాపడింది. ఏ మాత్రం క్రేజ్ తెచుకోలేకపోయింది. అందుకే, ఈ సినిమా సాఫీగా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవాలని భార్యభర్తలు ఇద్దరూ ప్రార్థనలు చేస్తున్నారు.
తాను నటించిన సినిమాలను నయనతార ప్రమోట్ చెయ్యదు. నిర్మాతల కష్టాలను పట్టించుకోదు. కానీ తానే నిర్మాత కావడంతో ఇప్పుడు తిప్పలు పడుతోంది.
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…
గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…