ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG). ఈ సినిమాకు ముందొచ్చిన ‘హరిహర వీరమల్లు’, ఈ సినిమా తర్వాతొచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల కంటే, ‘ఓజీ’నే బెటర్ అనేది అందరి మాట. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు. అటు పవన్ కల్యాణ్ కు కూడా ప్రొఫెషనల్ గా తృప్తినిచ్చిన సినిమా ఇది.
అందుకే ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ప్రకటించే ఆలోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి చెందిన నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా సడెన్ గా దర్శకుడు సుజీత్ ‘ఓజీ-2’ (OG 2) పనిలో పడ్డాడు అన్నట్లుగా ట్వీట్ చేసింది.
పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టే సుజీత్ వెంటనే పనులు ప్రారంభించాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం నానితో చేయాల్సిన ‘బ్లడీ రోమియో’ లేట్ అవుతోంది కాబట్టి ఈ గ్యాప్ లో ఓజీ సీక్వెల్ పై అతడు వర్క్ కొనసాగిస్తున్నాడని చెబుతున్నారు.
ఏదేమైనా ఓజీ సీక్వెల్/ప్రీక్వెల్ పనిమీద సుజీత్ ఉన్నాడనే ప్రచారం మాత్రం గట్టిగా సాగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ మాత్రం ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలి, ఏంటి అనేది సుజీత్ విదేశాల నుంచి వచ్చాక నిర్ణయిస్తామని చెప్తోంది.
నానితో తీయాల్సిన “బ్లడీ రోమియో”ని సుజీత్ పక్కన పెట్టి “ఓజీ 2″ని పట్టాలెక్కిస్తాడా లేక అది పూర్తి అయ్యాక ఇది చేస్తాడా అనేది చూడాలి.
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…
నాని (Nani) ఎంతో ఇష్టంగా మొదలుపెట్టారు ది ప్యారడైజ్ (The Paradise) సినిమాని. ఇష్టపడడమే కాదు కష్టపడి చేస్తున్నారు. ఐతే,…
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా సంజయ్ కిషోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ (Savithri Classics) ఇంగ్లీషు పుస్తకాన్ని శుక్రవారం…