న్యూస్

Radhika: భారతీరాజాని ఇలా చూడలేకపోతున్నా

తమిళ సినిమా రంగంలో గొప్ప దర్శకులలో ఒకరు భారతీరాజా (Bharathiraja). తమిళ్ లో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అవి తెలుగులో కూడా డబ్ అయ్యాయి, రీమేక్ అయ్యాయి. అలాగే ఆయన స్వయంగా తెలుగులోనూ సినిమాలు తీశారు.

16 ఏళ్ల వయసు, తూర్పు వెళ్లే రైలు వంటి సినిమాలను ఆయన తమిళ్ లో తీశారు. తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధన వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు.

రాధిక, రేవతి, రాధ, విజయశాంతి, ముచ్చర్ల అరుణ, వంటి హీరోయిన్లను ఆయనే పరిచయం చేశారు. ఇక హీరోలలో సుధాకర్ (కమెడియన్), కార్తీక్, భాగ్యరాజా వంటి వారిని స్టార్లుగా మలిచారు.

నాలుగు నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటి రాధిక (Radhika) ఆయనను కలసి పరామర్శించారు. ఈ సందర్బంగా భావోద్వేగానికి లోనైన ఆమె, ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీరాజాతో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసిన రాధిక, “ఆయన ఆశీర్వాదం అవార్డు కంటే గొప్పది. ఆయనను ఈ స్థితిలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చాలా బాధగా ఉంది. అయినా కూడా సినిమాపై ఆయనకున్న ప్రేమే ఆయనను ముందుకు నడిపిస్తోంది” అంటూ రాసుకొచ్చారు.

TeluguCinema

Recent Posts

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

5 hours ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

10 hours ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

15 hours ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

16 hours ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

1 day ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

1 day ago