అవీ ఇవీ

Kayadu Lohar: అగ్రిమెంట్ కుదుర్చుకుంది!

హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) ఇటీవల బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా తమిళ్ లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకొంది. తెలుగులో ఇటీవల “ఫంకీ” అనే సినిమాలో నటించింది. ఇప్పుడు నాని సరసన “ది ప్యారడైజ్” చిత్రంలో మెయిన్ హీరోయిన్.

ఈ సినిమా కోసం ఆమె ఇతర తెలుగు సినిమాలు వదిలేసుకుందట. ఎందుకంటే, “ది ప్యారడైజ్” (The Paradise) మేకర్స్ ఆమెతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు మరో తెలుగు పెద్ద చిత్రం ఒప్పుకోవద్దు అనేది కండీషన్. సినిమా షూటింగ్ ఎక్కువ డేట్స్ కావాలనే ఉద్దేశంతో అలా అగ్రిమెంట్ చేసుకున్నారట.

“ది ప్యారడైజ్” సినిమాని మొదట మార్చి 2026లో విడుదల చేద్దామనుకున్నారు. దాంతో, ఈ భామ ఆ అగ్రిమెంట్ సైన్ చేసింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఇప్పుడు రిలీజ్ డేట్ ని ఆగస్ట్ కి మార్చారు. ఒకవేళ ఇంకా ఆలస్యం ఐతే సినిమా డిసెంబర్ కి వెళ్లొచ్చు. అంటే ఆమె అలా ఈ సినిమా విషయంలో లాక్ అయింది.

మరి ఇన్ని నెలలు ఎక్స్ క్లూజివ్ గా పనిచేసినందుకు ఆమెకి ఎక్కువ పారితోషికం కానీ, ఒప్పుకున్న మొత్తానికి అదనపు మొత్తం కానీ ఇస్తారా అనేది చూడాలి.

TeluguCinema

Recent Posts

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…

1 hour ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

1 hour ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago

Pooja Hegde: ఈ ఏడాది రెండో విడుదలకు అంతా రెడీ!

గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…

2 days ago

Anna Raajan: ‘జైలర్ 2’ భామ మార్ఫింగ్ ఫోటో, పోలీసు కేసు

ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…

2 days ago

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

2 days ago