నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని మరో సినిమా తీస్తున్నాడు. బాలయ్య రాజుగా, నయనతార హీరోయిన్ గా సినిమాని ఇంతకుముందు ప్రకటించారు. కానీ ఆ సినిమా ఆగిపోయింది. కాకపోతే కథ మార్చి గోపీచంద్ మలినేని బాలయ్యకి ఈ కొత్త కథని చెప్తే ఓకే చెప్పారు. సో, ఇప్పుడు హీరోయిన్ల అన్వేషణ మొదలైంది.
నయనతారని తీసుకోవడం లేదు. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ నటించే అవకాశం ఉంది. ఇక రెండో హీరోయిన్ గా డింపుల్ హయతి (Dimple Hayathi) ని తీసుకుంటారు అనే టాక్ ఉంది. కానీ ఇంతకుముందే గోపీచంద్ మలినేని ఆ వార్తలను తోసిపుచ్చారు.
ఐతే, ఇటీవల ఎయిర్పోర్ట్ లో బాలయ్య, డింపుల్ హయతి కలుసుకున్నారు. ఆ టైంలో హయతి బాలయ్యతో చాలా సేపు ముచ్చటించడం, ఆ తర్వాత వెళ్తుండగా ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొంది. బాలయ్య కూడా ఆమెని ఆప్యాయంగా ఆశీర్వదించారు. దాంతో, బాలయ్య ఆమెకి ఛాన్స్ ఇస్తాడని అభిమానులు అనుకుంటున్నారు.
బాలకృష్ణని ఎవరైనా బాగా అభిమానించినా, ఆయన్ని గౌరవించినా వారికి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తారు. ఆయన ఎక్కువ ఆలోచించరు. డింపుల్ కి ఇప్పుడు పెద్ద సినిమాల్లో అవకాశాలు ముఖ్యం. సో, బాలయ్య ఆమెకి రెండో హీరోయిన్ గా అవకాశం ఇప్పిస్తారా లేదా అనేది చూడాలి. మొదటి హీరోయిన్ గా మాత్రం కాజల్ లేదా ఆ రేంజ్ హీరోయిన్ ని తీసుకుంటారు.
డింపుల్ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన “భర్త మహాశయులకు విజ్ణప్తి” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సగటు గృహిణి పాత్రలకు కూడా తాను సూట్ అవుతాను అని నిరూపించుకొంది.
రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…