అవీ ఇవీ

VD Nani: వాళ్ళు ఓకే, మరి వీళ్లు?

నాని (Nani), విజయ్ దేవరకొండ (VD) అభిమానులకు ఒకరంటే ఒకరు అస్సలు పడదు. విజయ్ దేవరకొండ ప్రతి సినిమాని ముందు ట్రోల్ చేసేది నాని అభిమానులే. నాని ఫ్యాన్స్ కి గట్టిగా సమాధానం ఇవ్వడంలో విజయ్ దేవరకొండ అభిమానులు కూడా తక్కువేమి కాదు.

ఒక టైంలో నాని కన్నా స్టార్డంలో, సక్సెస్ లో విజయ్ దేవరకొండ దూసుకెళ్లాడు. దాంతో నాని అభిమానులు గుర్రుగా ఉండి, విజయ్ ని ట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు పొజిషన్లు మారాయి. నాని ఇప్పుడు ఎక్కడికో దూసుకెళ్లిపోయాడు. సక్సెస్ ల పరంగా, మార్కెట్ పరంగా నాని ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. వరుస ఫ్లాప్ లతో దేవరకొండ సతమతం అవుతున్నాడు. రేస్ లో వెనుకబడ్డాడు.

ఐతే, నాని, దేవరకొండ మాత్రం తమ మధ్య అలాంటి విభేదాలు, ఈగోలు లేవని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. విజయ్ సినిమా విడుదలైనప్పుడు నాని విష్ చేస్తూనే, మెచ్చుకుంటూనో ట్వీట్స్ పెడుతుంటాడు. అలాగే మొన్న విజయ్, రష్మీక పెళ్ళికి సతీసమేతంగా నాని హాజరయ్యారు.

తాజాగా విజయ్ కొత్త సినిమాకి నాని క్లాప్ కొట్టారు. ఇద్దరూ ఒకరికి ఒకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

మరి వీరి ఫ్యాన్స్ కూడా ఆ సోషల్ మీడియా గొడవలు, ట్రోల్స్ ఆపేస్తే బెటర్.

TeluguCinema

Recent Posts

Kurchi Madathapetti: త్వరలోనే వంద కోట్ల మైలురాయి!

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…

3 hours ago

Pooja Hegde: పూజ పేరు ఇంకో భారీ ప్రాజెక్టులో!

పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…

6 hours ago

Alcohol: మర్చిపోయిన మూవీని గుర్తు చేశారు

ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…

6 hours ago

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

1 day ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

1 day ago

Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…

1 day ago